»   » స్పైడర్‌లో మహేశ్ దేవుడిలా ఉన్నాడు.. ప్రిన్స్‌పై ట్విట్టర్‌లో వర్మ ప్రశంసల జల్లు..

స్పైడర్‌లో మహేశ్ దేవుడిలా ఉన్నాడు.. ప్రిన్స్‌పై ట్విట్టర్‌లో వర్మ ప్రశంసల జల్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్పైడర్ ఫస్ట్‌లుక్‌లో కనిపించిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు దేవుడిలా ఉన్నాడు అంటూ వివాదాస్పద రాంగోపాల్ వర్మ ప్రశంసలతో ముంచెత్తారు. టాలీవుడ్‌లో కొంతమంది హీరోలను ఎప్పుడూ టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వర్మ ఒక్కసారిగా ప్రిన్స్‌పై ప్రశంసలు కురిపించడంపై మహేశ్ అభిమానులు తబ్బిబ్బవుతున్నారు.

సింప్లీ సూపర్బ్..

బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదలైన స్పైడర్ ఫస్ట్‌లుక్ మోషన్ పిక్చర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రిన్స్ ఫస్ట్‌లుక్‌పై వర్మ స్పందిస్తూ.. సింప్లీ. అద్భుతంగా ఉన్నాడు.. మహేశ్‌బాబు దేవుడిలా కనిపిస్తున్నాడు అని ట్వీట్ చేశారు. ట్వీట్‌తోపాటు ఫస్ట్‌లుక్ ఫోస్టర్‌ను ట్యాగ్ చేశాడు.


ఇంటర్నెట్‌లో మోత..

ఇంటర్నెట్‌లో మోత..

స్పైడర్ ఫస్ట్‌లుక్ రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్‌లో మోత మోగుతున్నది. ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో మోషన్ పిక్చర్‌కు కొది సేపట్లోనే 16 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 32 వేలకు పైగా లైక్ కొట్టడం గమనార్హం.


విలన్‌గా ఎస్‌జే సూర్య

విలన్‌గా ఎస్‌జే సూర్య

స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ ఇంటెలిజెన్స్ అధికారిగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో దర్శకుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర అద్బుతంగా ఉంటుందనే వార్త బాగా ప్రచారమవుతున్నది.


జూన్ 23న విడుదల

జూన్ 23న విడుదల

హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తున్నది. టాగోర్ మధు, ప్రసాద్ జంటగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది. బాలీవుడ్‌లో సల్మాన్ నటిస్తున్న ట్యూబ్‌లైట్ చిత్రంతో స్పైడర్ పోటీ పడటం విశేషం.


కొరటాల శివతో భరత్ అనే నేను

కొరటాల శివతో భరత్ అనే నేను

స్పైడర్ చిత్రం తర్వాత మహేశ్ తన 24వ చిత్రాన్ని కొరటాల శివ, 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి, 26వ చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి భరత్ అను నేను టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ చిత్ర కథ కోసం కొరటాల శివ కోటి రూపాయలు చెల్లించినట్టు సమాచారం.


English summary
Director Ram Gopal Varma has heaped praise on Tollywood superstar Mahesh Babu for his upcoming film Spyder. Heaping praise on Mahesh Babu's first look poster from the upcoming film Spyder, Ram Gopal Varma took to Twitter to praise the former. He wrote, "Simply Amazing..Mahesh is literally looking like God."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu