»   » అనుష్క ఎఫెక్ట్ : ఫస్ట్ ప్లేస్ నుంచి మహేష్ వెనక్కి

అనుష్క ఎఫెక్ట్ : ఫస్ట్ ప్లేస్ నుంచి మహేష్ వెనక్కి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మీకు గుర్తుండే ఉండి ఉంటుంది. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2014లో మహేష్ ...ఫస్ట్ ప్లేస్ లో వచ్చాడు. ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2015కి వచ్చేసరికి ..క్రికటెర్ విరాట్ కోహ్లి... మొదటి ప్లేస్ లోకి వచ్చేసాడు. ఇప్పుడు మహేష్ ఏ ప్లేస్ లో ఉన్నాడు అంటే...ఆరవ ప్లేస్ లోకి వచ్చాడు. హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, షాహిద్ కపూర్ లు టాప్ 5 స్లాట్ లో సర్దుకున్నారు. విరాట్ కోహ్లి సీన్ లోకి రావటానికి కారణం..అనుష్క శర్మ తో ప్రేమాయణమే అంటున్నారు.

ఇక మహేష్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

మహేష్ బాబు - ‘మిర్చి' ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర టీం యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో బిజీగా ఉన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Mahesh Babu loses out to Virat Kohli

ఇక ఇటీవలే ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నారు. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథల్లో ఇట్టే ఇమిడిపోతారు మహేష్‌. 'మురారి', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో ఆ విషయం రుజువైంది. అలా మరోసారి ఇంటిల్లిపాదినీ అలరించేలా ఓ చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

మహేష్‌ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ హంగులతో రూపొందుతున్న ఆ పోరాటాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్‌, జగపతిబాబు, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాకి ‘శ్రీ మంతుడు' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.మహేష్ బాబుతో మొదటి సారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఫ్రాన్స్ లో ఉంటుందని సమాచారం.

English summary
On the Times Most Desirable 2014 (Men), this year somehow Mahesh Babu has fallen back to 6th position. While Virat grabbed the top spot, Hrithik, Fawad Khan, Farhan Akthar and Shahid Kapoor bagged the Top 5 spots.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu