»   » ‘జనతా గ్యారేజ్’లోకి ఎంటరవుతున్న మహేష్ బాబు, ఎందుకు?

‘జనతా గ్యారేజ్’లోకి ఎంటరవుతున్న మహేష్ బాబు, ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ద్విబాషా చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శర వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

నిన్నమొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగ్గా... తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. సినిమా షూటింగులో భాగంగా మహేష్ బాబు జనతా గ్యారేజ్‌లో ఎంటరవ్వబోతున్నట్లు సమాచారం.

'జనతా గ్యారేజ్‌' కోసం హైదరాబాద్‌ సారథీ స్టూడియోలో భారీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఇదే సెట్లో కొన్ని మార్పులు చేసి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన సీన్లు చిత్రీకరించబోతున్నారట.

ఓ ఫైట్‌ సీన్ తో పాటు...., ఓ పాటను ఈ సెట్లో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. అయితే ఇది జనతా గ్యారేజ్ సెట్ అనే అనుమానం రాకుండా కొన్ని మార్పులు చేయడంతో పాటు, సెట్ కలర్ థీమ్ లో కూడా మార్పులు చేస్తున్నారట.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

ఇదే సెట్

ఇదే సెట్

సారథి స్టూడియోలో వేసిన జనతా గ్యారేజ్ సెట్ ఇదే. ఇందులో కొన్ని మార్పులు చేసిన మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ మూవీ

భారీ బడ్జెట్ మూవీ

మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో ద్విబాషా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

మహేష్ బాబు భార్య కూడా?

మహేష్ బాబు భార్య కూడా?

ఈ చిత్రంలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా గెస్ట్ రోల్ చేస్తుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఎస్.జె.సూర్య

ఎస్.జె.సూర్య

ఈచిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

వంద కోట్లు?

వంద కోట్లు?

ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నారు. డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు.

English summary
Mahesh Babu, Murugadoss film going to release in both Tamil and Telugu languages, few of the movie crucial scenes have already finished shooting in Chennai in night mode and for few more scenes, the movie team has shifted to Hyderabad. it is heard that movie unit is using the set that is constructed for Janatha Garage movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu