»   » మహేష్ బాబుకు అది మరీ ఎక్కువ, అందుకే కోత?

మహేష్ బాబుకు అది మరీ ఎక్కువ, అందుకే కోత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ దర్శకుడు మురుగదాస్ మహేష్ బాబుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రూ. 110 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినప్పటికీ..... నిర్మాతలు మాత్రం అంత ఇన్వెస్ట్ చేయడానికి సాహసించడం లేదని తెలుస్తోంది. అంత బడ్జెట్ పెడితే లాభాల శాతం పడి పోతుందనే భావనకు వచ్చిన నిర్మాతలు.....బడ్జెట్ న కుదించాల్సిందిగా దర్శకుడిపై ఒత్తిడి తెస్తున్నారట. నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ మేరకు ఎన్.వి.ప్రసాద్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రూ. 90 కోట్లలో సినిమాను పూర్తి చేయాలని వీరు నిర్ణయించినట్లు సమాచారం. అంతకు మించితే ప్రాఫిటబుల్ గా ఉండదని అంటున్నారు.

Mahesh Babu And Murugadoss Film Budget locked?

ఇప్పటి వరకు తెలుగులో టాప్ బడ్జెట్ మూవీ అంటే ‘బాహుబలి' మాత్రమే. ఇపుడు మహేష్ బాబు చిత్రం రూ. 90 కోట్లతో తెరకెక్కితే తెలుగులో అత్యధిక బడ్జెట్ తో తీసిన రెండో సినిమా అవుతుంది. తెలుగు, తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తారు కాబట్టి రూ. 150 కోట్ల రాబడి వస్తుందనే ఎస్టిమేషన్స్‌ వేస్తున్నారు.

తమిళ న్యూఇయర్ సందర్భంగా ఏప్రిల్ 14న చెన్నైలో సినిమాను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ మార్కెట్ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఈ సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ చిత్రం ఏ జానర్ లో రూపొందనుంది అనేది చర్చనీయాంశం అయింది. ఇప్పటివరకూ మీడియాలో ప్రచారమైన వార్తలు ప్రకారం..భారత న్యాయ వ్యవస్ధపై ఈ సినిమా రూపొందుతోందని అన్నారు.

English summary
Film Nagar source said that, Mahesh Babu And Murugadoss Film Budget locked. According to our sources, the producer N V Prasad and director Murugadoss have now locked the budget to the tune of Rs 90 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu