»   » ‘శ్రీమంతుడు’ సైకిల్ డ్రా... విజేత ఇతడే (ఫోటోస్)

‘శ్రీమంతుడు’ సైకిల్ డ్రా... విజేత ఇతడే (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్‌ రన్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేలాదిగా ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. నవంబర్‌ 13తో ఈ కాంటెస్ట్‌ ముగిసింది. నవంబర్‌ 14న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు డ్రా తీసి ఈ కాంటెస్ట్‌లో విజేతను ఎంపిక చేసారు.

ఈ లక్కీ డ్రాలో జి. నాగేందర్ రెడ్డి శ్రీమంతుడు సైకిల్ దక్కించుకున్నాడు. మహేష్ బాబు చేతుల మీదుగా అతనికి శ్రీమంతుడు సైకిల్ అందజేయనున్నారు. మహేష్ బాబు డ్రా తీసిన ఫోటోలు స్లైడ్ షోలో....

100 డేస్ సందర్బంగా డ్రా..

100 డేస్ సందర్బంగా డ్రా..


శ్రీమంతుడు మూవీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సైకిల్ డ్రా తీసారు.

కాంటెస్టు ఇలా..

కాంటెస్టు ఇలా..


iamsrimanthudu.com అనే వెబ్ సైట్లో రిజస్టర్ అయిన రూ. 999 విరాళం అందించడం ద్వారా ఈ లక్కీడ్రాలో అభిమానులు పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.

డ్రా...

డ్రా...


14 సెప్టెంబర్ నుండి నవంబర్ 13 వరకు కాంటెస్టు నిర్వహించారు. రిజిస్ట్రేషన్స్ ద్వారా విరాళాలు స్వీకరించారు.

విజేత

విజేత


ఈ లక్కీ డ్రాలో జి. నాగేందర్ రెడ్డి శ్రీమంతుడు సైకిల్ దక్కించుకున్నాడు.

మహేష్ బాబు

మహేష్ బాబు


మహేష్ బాబు చేతుల మీదుగా అతనికి శ్రీమంతుడు సైకిల్ అందజేయనున్నారు.

English summary
Superstar picks up the Lucky Winner of ‪‎Srimanthudu‬ Bicycle from the Draw!
Please Wait while comments are loading...