అఖిల్ 'ఏజెంట్' టీజర్ పై మహేష్ ప్రసంశలు.. పేరుపేరునా ప్రస్తావిస్తూ!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఎట్టకేలకు హిట్టు కొట్టిన అఖిల్ ఏజెంట్ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ టీజర్ బాగోవడంతో అటు ప్రేక్షకులు మాత్రమే కాక సెలబ్రిటీలు కూడా అఖిల్ సహా సినిమా యూనిట్ మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ చూసిన మహేష్ బాబు కూడా తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఏజెంట్ టీజర్ చూసిన మహేష్ బాబు ఆశ్చర్యంలో మునిగిపోవడమే కాక సోషల్ మీడియా వేదికగా ఏజెంట్ టీజర్ కి రివ్యూ ఇచ్చేశారు. ఏజెంట్ టీజర్ మతిపోగొట్టేలా ఉందని చాలా స్టన్నింగ్ గా ఉంది. ఈ సినిమా థీమ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, అఖిల్ అక్కినేని, మమ్ముట్టి సర్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అని మహేష్ ట్వీట్ చేశారు. ఇక మహేష్ బాబు సినిమాలు విషయానికి వస్తే చివరిగా సర్కారు వారి పాట అనే సినిమా చేశారు. పరుశురాం దర్శకత్వంలోకి తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

Mahesh Babu praises Akhils agent movie teaser

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త ఇబ్బంది పడినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఆగస్టు నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. రాజమౌళితో చేయబోయే సినిమా గురించి ఆయన అభిమానులు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు అలాగే భారతదేశ వ్యాప్తంగా ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X