రవితేజకి అనుకున్న ప్రాజెక్టు లోకి మహేష్ వచ్చి...
మహేష్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం పోకిరి. పూరి జగన్నాథ్ తొలుత రవితేజతోనే ఈ కథను తెరకెక్కిద్దామనుకున్నారు. అప్పుడు ఈ సినిమా టైటిల్... 'ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ'. రవితేజ-పూరి ఇద్దరూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు.. పూరికి తట్టిన ఆలోచన ఇది.
అది కాస్తా 'పోకిరి'గామారి.. మహేష్‌బాబు చేతికి వెళ్లింది. మహేష్‌బాబు కెరీర్‌లో ఓ మరపురాని చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో ఇలియానా అందాల్ని మర్చిపోలేం. అయితే అక్కడా మార్పు జరిగింది. మొదట ఆ పాత్ర కోసం ముందు పార్వతిమెల్టన్‌ని సంప్రదించారు.
'పోకిరి' మొదలయ్యే సమయానికి 'వెన్నెల' సినిమా రిలీజయ్యి.. పార్వతిని చూసి పూరీ అవకాసమిచ్చారు. పొడుగ్గా ఉంటుంది కాబట్టి మహేష్ పక్కన సరిగ్గా నప్పుతుంది అనుకొన్నారు. కానీ... చివరి నిమిషంలో ఇలియానా దగ్గరకి చేరిందా చిత్రం. 'పోకిరి' దక్కి ఉంటే... పార్వతి కెరీర్ ఎలా ఉండేదో మరి అని ఫిల్మ్ సర్కిల్స్ లో అనుకుంటూంటారు.


Click it and Unblock the Notifications












