»   » బాహుబలి నేషనల్ అవార్డు గురించి మహేష్ బాబు.. ఇండియన్ సినిమాకే ల్యాండ్ మార్క్!

బాహుబలి నేషనల్ అవార్డు గురించి మహేష్ బాబు.. ఇండియన్ సినిమాకే ల్యాండ్ మార్క్!

Subscribe to Filmibeat Telugu

ఏడాది క్రితం బాహుబలి 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు. ఇండియన్ సినిమాలోనే బాహుబలి చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏళ్లతరబడి కష్టపడిన రాజమౌళి, అతడి టీం బాహుబలి రూపంలో విజువల్ వండర్ ని ప్రేక్షకులకు అందించడం విశేషం. బాహుబలి చిత్రం అంతర్జాతీయ వ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. రాజమౌళి పేరు ప్రఖ్యాతలు దశదిశలా వ్యాపించాయి.

బాహుబలి2 చిత్రానికి 65 వ జాతీయ ఫిలిం అవార్డులలో మూడు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ పాపులర్ ఫిలిం, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో బాహుబలి చిత్రం అవార్డుల మోత మోగించింది. కష్టానికి తగిన ఫలితం దక్కడంతో బాహుబలి చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది. ప్రముఖుల నుంచి రాజమౌళి, ప్రభాస్, రానాకు అభినందనలు వెల్లువెతుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బాహుబలి చిత్రం మూడు జాతీయ అవార్డులని కైవసం చేసుకోవడంపై స్పందించాడు. బాహుబలి చిత్రం నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడంపై మహేష్ రాజమౌళి శుభాకాంక్షలు తెలియజేశాడు.బాహుబలి చిత్రం ఇండియన్ సినిమాలో ల్యాండ్ మార్క్ మూవీ అని అభివర్ణించాడు.

English summary
Mahesh Babu response on Bahubali winning 3 National awards. Bahubali is the best popular film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X