»   » హై ఓల్టేజ్ యాక్షన్...(మహేష్ ‘1’ ఫోటోలు లీక్)

హై ఓల్టేజ్ యాక్షన్...(మహేష్ ‘1’ ఫోటోలు లీక్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ 1(నేనొక్కడినే). తాజాగా ఈచిత్రంలోని యాక్షన్ సీన్స్‌కు సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.

  ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పలు అంశాలు మహేష్ బాబు అభిమానులను ఆశ్చర్య పరచనున్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో VFX వర్క్ ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. కొన్ని స్పెషల్ ఎఫెక్టుల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈచిత్రానికి పని చేసారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

  సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. యూనిట్ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిసానో ఆధ్వర్యంలో మహేష్ బాబు పలు ఫైట్ సీన్లు, చేజింగ్ సీన్లు అద్భుతంగా చేసారని స్పష్టమవుతోంది.

  మహేష్ బాబు-క్రితి సానన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. తెలుగులో పలు చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా మహేష్ బాబు చిత్రానికి పని చేస్తున్నారు. రోబో లాంటి చిత్రాలకు పని చేసిన ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈచిత్రానికి పని చేస్తున్నారు.

  సంక్రాంతి బరిలో...

  సంక్రాంతి బరిలో...


  మహేష్ బాబుకు నటిస్తున్న 1(నేనొక్కడినే) చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసారు.

  ఓవర్సీస్‌లో...

  ఓవర్సీస్‌లో...


  ‘1'(నేనొక్కడినే) చిత్రాన్ని ఓవర్సీస్‌లో FICUS సంస్థ విడుదల చేయనుంది. మహేష్ బాబు సినిమాలకు యూఎస్‌లో బాగా డిమాండ్ ఉండటంతో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  అనేక ప్రత్యేకతలు

  అనేక ప్రత్యేకతలు


  ఈ చిత్రం ఈ సారి అనేక ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదివరకెన్నడూ చూడని బ్రహ్మాండమైన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది వరకు ఏ తెలుగు సినిమాలో లేని విధంగా ఈ చిత్రాన్ని 2 నెలల పాటు యూకెలో చిత్రీకరణ జరిపారు.

  గౌతం కృష్ణ ఎంట్రీ

  గౌతం కృష్ణ ఎంట్రీ


  1(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ తనయుడు గౌతం కృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే గౌతంపై పలు సీన్లు చిత్రీకరించారు. ఈ చిత్రంలో గౌతం చిన్ననాటి మహేష్ బాబుగా కనిపించబోతున్నారు.

  ఆడియో రిలీజ్

  ఆడియో రిలీజ్


  డిసెంబర్ 14న ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి ఈ చిత్రం ఆడియో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నట్లు వినికిడి.

  English summary
  Director Sukumar's upcoming Telugu movie 1: Nenokkadine, which is scheduled to release in theatres as Sankranthi treat, has several surprises for Superstar Mahesh Babu's fans. One of them is the VFX work in the action sequences. The makers of the movie have roped in Hollywood technicians for the special effects of the film, which has almost wrapped up its filming and is currently in post-production stage.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more