»   » హై యాక్షన్, సస్పెన్స్...(1-నేనొక్కడినే ట్రైలర్ రివ్యూ)

హై యాక్షన్, సస్పెన్స్...(1-నేనొక్కడినే ట్రైలర్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు '1-నేనొక్కడినే' చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తాజాగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

ఈ రోజు విడుదలైన 59 సెకన్ల నిడివిగల ట్రైలర్ పరిశీలిస్తే...హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. జేమ్స్ బాండ్ సినిమాల మీదిరి ఈచిత్రంలో హై యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు చూడబోతున్నామని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

రొటీన్ సినిమాల్లా కాకుండా డిఫరెంటు లొకేషన్లలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. బైక్, కార్ చేజింగులు, గన్ షాట్స్.....సస్పెన్స్‌తో కూడిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టి పడేస్తుందని తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని ఆయన స్వయంగా వెల్లడించారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు గూడచారి పాత్రలో నటిస్తున్నాడు. క్రితి సానన్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నాజర్, అను హుస్సేన్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, విక్రమ్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. సినిమాలో కూడా ఇదే తరహాలో దేవిశ్రీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొడుతుందని తెలుస్తుంది. సుకుమార్ డైలాగులు, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి.

ట్రైలర్‌కు యూట్యూబులో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియో అప్ లోడ్ చేసిన 5 గంటల్లోనే ఈ వీడియో దీన్ని వీక్షించిన వారి సంఖ్య లక్షా పాతికవేలు దాటింది....ట్రైలర్ ఎంతో బాగుందంటూ పలువురు అభిమానులు అభిప్రాయ పడ్డారు.

భారీ బిజినెస్

భారీ బిజినెస్

ఈ చిత్రం విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిన సంగతి. సినిమా విడుదలైన తర్వాత హిట్ టాక్ వస్తే రూ. 100 కోట్లు వసూలు కావడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబుకు ఫాలోయింగ్

మహేష్ బాబుకు ఫాలోయింగ్

మహేష్ బాబు సినిమాలకు కేవలం యూత్ లోనే కాదు, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఎక్కువ. సుకుమార్ దర్శకత్వం వహించడం అనే అంశం మరింత ప్లస్.

నిర్మాతలు

నిర్మాతలు

మహేష్ బాబుతో గతంలో దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మహేష్ తనయుడు తెరంగ్రేటం

మహేష్ తనయుడు తెరంగ్రేటం

ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ బాలనటుడిగా తెరంగ్రేటం చేయబోతున్నారు.

రెస్పాన్స్ కేక...

రెస్పాన్స్ కేక...

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు, పోస్టర్లకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

English summary
Superstar Mahesh Babu's fans were desperately waiting to see the theatrical trailer of his upcoming movie 1: Nenokkadine, which is slated to release in theatres on January 10. Finally, the makers of the film have unleashed the trailer on the 14 Reel Entertainment's official channel on YouTube.
Please Wait while comments are loading...