‘ఆగడు’ 1 మిలియన్- ఫ్యాన్స్ స్పందన ఇలా!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రం టీజర్ ఇటీవల మే 31న మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన సంగతి తెలిసిందే. 51 సెకండ్ల నిడివిగల ఈ వీడియో ఇంటర్నెట్లో దుమ్ము రేపుతోంది. నాలుగు రోజుల్లోనే 1 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది.
ట్రైలర్ పరిశీలిస్తే....ఈ చిత్రం బల్లారిలో జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ గురించి ఉంటుందని తెలుస్తోంది. గతంలో పోకిరి, దూకుడు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన మహేష్ బాబు 'ఆగడు' చిత్రం ద్వారా మూడో సారి పోలీస్ ఆఫీసర్‌గా తెరపై కనిపించబోతున్నాడు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. అయితే ట్రైలర్లో మాత్రం ఆమె కనిపించలేదు. మహేష్ బాబు తప్ప ఇతర నటీనటులు ఎవరూ ట్రైలర్లో కనిపించలేదు. పూర్తిగా మహేష్ బాబు యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ ట్రైలర్ నింపేసారు. ఎస్ఎస్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, కెవి గుహన్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
అదే విధంగా ఈ చిత్రంలో నటిస్తున్న కామెడీ డాన్ బ్రహ్మానందానికి సంబంధించిన ఒక్క సీన్ కూడా ట్రైలర్లో ఉండక పోవడం పరిశీలిస్తే.....సినిమాలో మహేష్ బాబుకు తప్ప మరేపాత్రకు అధిక ప్రాధాన్యత ఉండదని అంటున్నారు. ఆగడు ట్రైలర్ చూసిన పలువురు అభిమానులు ట్విట్టర్లో తమదైన రీతిలో స్పందించారు. ఆ వివరాలు స్లైడ్ షోలో...

AshrithA @Ashrithashellz
పోరికి, దూకుడు.....ఇపుడు ‘ఆగడు'. పోలీసు పాత్ర చేసిన ప్రతి సారి మహేష్ బాబు డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తున్నారు. ‘ఆగడు' పాత్ర కూడా వైవిద్యంగా ఉంటుందని నమ్ముతున్నారు. మహేష్ బాబు అభిమాని అయినందుకు గర్విస్తున్నాను.

Ravi Teja @ivrteja
ఆగడు టీజర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాం.

Srikrs @Srikrs
‘ఆగడు' టీజర్ గబ్బర్ సింగ్ చూసిన ఫీల్ కలిగిస్తోందని అంటున్నారు. నేను దీన్ని ఖండించడం లేదు. అయినా నేను మహేష్ బాబు అభిమానినే.

Raghavendra @raghava4mahesh
ఆగడు చిత్రం పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ట్రైలర్ అదిరిపోయింది.


Click it and Unblock the Notifications











