»   » మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ మొదలైంది

మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. రేపు(సెప్టెంబర్ 16) మహేష్ బాబు షూటింగులో జాయిన్ కాబోతున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిస్ సమంత మూడోసారి మహేష్ బాబుతో నటించే అవకాశం దక్కించుకుంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పలు రొమాంటిక్ సీన్లను ప్లాన్ చేసాడు.


Mahesh Babu’s ‘Brahmotsavam’ begins!

గతంలో దూకుడు సినిమాలో మహేష్ బాబు-సమంత మధ్య కిస్ సీన్ ఉన్న నేపథ్యంలో ‘బ్రహ్మోత్సవం'లో కూడా ఫ్రెంచి కిస్ సీన్ ప్లాన్ చేసాడట. అయితే మహేష్ బాబు ఈ సీన్ ను రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన శ్రీమంతుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై ఫ్యామిలీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో లిప్ లాక్ సీన్ పెట్టడం వల్ల ప్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఈ సీన్ రిజక్ట్ చేసాడట.


పీవీపీ బ్యాన‌ర్‌పై పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ‘బ్రహ్మోత్సవం' సినిమా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబుకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో హిట్ అందించిన దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

English summary
Mahesh Babu’s ‘Brahmotsavam’ begins today in Hyderabad. As per the sources, we heard that, the handsome star Mahesh Babu will be joining the crew on September 16th.
Please Wait while comments are loading...