»   » అంటే ...మహేష్ , డైరక్టరూ రాజీ పడ్డారా?

అంటే ...మహేష్ , డైరక్టరూ రాజీ పడ్డారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ హిట్ 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత మహేష్‌ బాబు చేస్తున్న సినిమా 'బ్రహ్మోత్సవం' . పి.వి.పి. సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ లో స్క్రిప్టులో ఉన్నవి కాకుండా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొత్త ఇప్రవైజింగ్స్ చేస్తున్నాడని, ఆ మార్పులు నచ్చని మహేష్ కోపంగా వెళ్లిపోవటంతో షూటింగ్ ఆగిపోయిందని గత కొద్ది రోజులుగా వార్తలు మన వింటున్నాం.

అయితే తాజాగా ఈ చిత్రం యూనిట్ తమ షెడ్యూల్ వివరాలను మీడియాకు తెలియచేసింది. రామోజీ ఫిల్మ్ సిటీ, ఊటీలలో ఈ చిత్రం కంటిన్యూ షెడ్యూలు షూటింగ్ జరపనున్నట్లు ప్రకటించింది. దాంతో ఇవి విన్నవారు...మహేష్ ,దర్శకుడు మధ్య వచ్చిన విభేధాలు తొలిగిపోయాయని, రాజీ పడ్డారని అంటున్నారు. అయితే మరికొంత మంది మాత్రం అసలు మహేష్,శ్రీకాంత్ అడ్డాల మధ్య ఎటువంటి విభేధాలు చోటు చేసుకోలేదని, అవి కేవలం మీడియా సృష్టే అని కొట్టిపారేస్తున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Mahesh Babu’s Brahmotsavam goes to Ooty!

దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ ''ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్‌ జరిగాయి. ఈనెల 28 నుంచి మూడో షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభిస్తున్నాం. డిసెంబర్‌ 9 వరకు హైదరాబాద్‌లో షూట్‌ చేసి ఊటీ షిఫ్ట్‌ అవుతాం. డిసెంబర్‌ 10 నుంచి నెలాఖరు వరకు ఊటీలో షెడ్యూల్‌ చేస్తాం. ఊటీలో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తాం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ తర్వాత మహేష్‌తో మళ్ళీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

పి.వి.పి. సినిమా అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు.

మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.

English summary
Mahesh Babu’s Brahmotsavam team will go to Ooty for next schedule, which starts from December 10th and by the end of December will complete it.
Please Wait while comments are loading...