twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బ్రహ్మోత్సవం’ ఫంక్షన్ లో : మహేష్ రిక్వెస్ట్, సమంత కి టెన్షన్, జయసుధ కన్నీళ్లు (ఫొటోలతో)

    By Srikanya
    |

    హైదరాబాద్: మ‌హేష్ హీరోగా న‌టించిన సినిమా బ్ర‌హ్మోత్సవం. స‌మంత‌, కాజ‌ల్‌, ప్ర‌ణీత నాయిక‌లు. పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో శ‌నివారం రాత్రి విడుద‌ల చేశారు. ఈ ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా , రెగ్యులర్ ఫంక్షన్స్ లా కాకుండా జరిగి, అందరిలో ఉత్తేజం నింపింది.

    తన కుటుంబంతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్న మహేష్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు. అయితే మహేష్ తన అభిమానులు ఒక టైమ్ లో సూపర్ స్టార్ జిందాబాద్ అని ఆయన మాట్లాడుతూంటే డిస్ట్రబ్ చేస్తూంటే వాళ్లను రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది.

    హీరో మహేశ్ మాట్లాడుతూ..ఒక్క నిమిషమమ్మా నేను మాట్లాడేదే తక్కువ రెండు నిమిషాలు మాట్లాడనివ్వండని అభిమానులను కోరారు. సూపర్ స్టార్ జిందాబాద్ అంటూ అభిమానుల నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగానే మూడు సార్లు అబిమానులకు తనను మాట్లాడనివ్వాలని కోరుతూ వాళ్లను సముదాయించడానికి ప్రయత్నించారు ప్రిన్స్.

    మే 20న బ్రహ్మోత్సవాలు మొదలవ్వబోతున్నాయని చాలా పెద్ద పండగాలాగా ఉండాలని అన్నారు. ఎవరిమీదన్నా నిజంగా ప్రేమంటే దాన్ని మాటల్లో వ్యక్తపరచలేమని, తన కెరీర్‌ను సపోర్ట్ చేసి, ఇంతవాణ్ని చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ...మీరంతా ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పారు సూపర్ స్టార్ మహేష్.

    మహేష్ ఇంకేమన్నారు, మిగతా వాళ్లు ఇంకేమన్నారు, ఫొటోలతో క్రింద చూడండి.

    తొలిసీడీని ...

    తొలిసీడీని ...

    ఈ చిత్రం తొలి సీడిని మహేష్‌ ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి అందజేశారు.

    ట్రైలర్ విడుదల

    ట్రైలర్ విడుదల

    స‌త్య‌రాజ్‌, రేవ‌తి, జ‌య‌సుధ‌, కాజ‌ల్‌, స‌మంత‌ సంయుక్తంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

    నేర్చుకున్నా

    నేర్చుకున్నా

    ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి పనిచేసినప్పుడు మనిషిగా ఎదిగా. ‘బ్రహ్మోత్సవం'తో మరిన్ని విషయాలు నేర్చుకొన్నాను''అన్నారు మహేష్‌బాబు.

    ప్రత్యేకం

    ప్రత్యేకం

    మహేష్‌బాబు మాట్లాడుతూ.... ఈ రోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మా అమ్మాయి సితార ఈ ఆడియో ఫంక్షన్‌కి వచ్చింది. నా సినిమాల పాటల వేడుకకు సితార రావడం ఇదే తొలిసారి. అందరికీ మంచే జరుగుతుంది.

    చాలా నేర్చుకున్నా

    చాలా నేర్చుకున్నా

    ఈ సినిమాతో పెద్ద పెద్ద స్టార్స్‌తో పనిచేసే అవకాశం దక్కింది. వాళ్ల నుంచి చాలా నేర్చుకొన్నా. మరీ ముఖ్యంగా సత్యరాజ్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలసి పనిచేయడం ఓ గౌరవం.

    మర్చిపోలేను

    మర్చిపోలేను

    తోట తరణి గారి గురించి మాట్లాడే అనుభవం నాకు లేదు.‘అర్జున్‌'లో ఆయన వేసిన సెట్‌ ఎప్పటికీ మర్చిపోను.

    ఫొన్ చేసి అడగ్గానే...

    ఫొన్ చేసి అడగ్గానే...

    నేను ఫోన్‌ చేసి అడగ్గానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు రత్నవేలు.

    ఇంకా బాగుంటాయి

    ఇంకా బాగుంటాయి

    ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నా కెరీర్‌లో బెస్ట్‌ ఆల్బమ్‌. దానికంటే ఈ సినిమాలో పాటలు ఇంకా బాగుంటాయి.

    అందుకే అంత స్వఛ్చం

    అందుకే అంత స్వఛ్చం

    దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల అంటే నాకు చాలా ఇష్టం. చాలా స్వచ్ఛంగా ఉంటారాయన. పరిశ్రమ వ్యక్తులతో పెద్దగా కలవరు. అందుకే అంత స్వచ్ఛంగా ఉంటారేమో? ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలి.

    అవసరం

    అవసరం

    పీవీపీ లాంటి అభిరుచి ఉన్న నిర్మాతల అవసరం చాలా ఉంది అని మహేష్ బాబు అన్నారు.

    వ్యక్తపరచలేం

    వ్యక్తపరచలేం

    అభిమానుల గురించి నేనెప్పుడూ పెద్ద మాటలు మాట్లాడను. నిజంగా ప్రేమ ఉంటే మాటలతో దాన్ని వ్యక్తపరచలేం. నన్ను ఇంత వాణ్ని చేసింది అభిమానులే.

    పండుగ చేసుకుందాం

    పండుగ చేసుకుందాం

    ఈ నెల 20న ‘బ్రహ్మోత్సవం' విడుదలవుతుంది. థియేటర్లలో పండగ చేసుకొందామ''అన్నారు మహేష్ బాబు.

    కృష్ణ మాట్లాడుతూ...

    కృష్ణ మాట్లాడుతూ...

    ‘‘మంచి అభిరుచి ఉన్న నిర్మాణ సంస్థ పీవీపీ. తెలుగు, తమిళ భాషల్లో ఉత్తమ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చూశా. సహజంగా ఉంటుందా కథ. పాత్రలు నటిస్తున్నట్టు ఎక్కడా కనిపించదు. ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది.

     గొప్పగా ఆడాలి

    గొప్పగా ఆడాలి

    ‘బ్రహ్మోత్సవం' ప్రచార చిత్రం బాగుంది. గత చిత్రాల కంటే మహేష్‌ అందంగా కనిపిస్తున్నాడు. మీక్కీ జె. మేయర్‌ అందించిన సంగీతం నచ్చింది. ‘శ్రీమంతుడు' మహేష్‌ చిత్రాల్లో రికార్డు వసూళ్లు సాధించింది. ‘బ్రహ్మోత్సవం' అంతకంటే గొప్పగా ఆడాలి. నిర్మాతలకు మంచి డబ్బులు తీసుకురావాలి'' అని ఆకాంక్షించారు కృష్ణ.

     కాజల్‌ మాట్లాడుతూ...

    కాజల్‌ మాట్లాడుతూ...

    ‘‘నా ఆలోచనలకు దగ్గరగా ఉండే కథ ఇది. అందుకే ఇష్టంగా చేశా. నటీనటులకు సినిమా ఓ మతం. ఆ మతానికి ‘బ్రహ్మోత్సవం' ఓ ప్రార్థనా గీతం'' అంది.

    సమంత టెన్షన్ ..టెన్షన్

    సమంత టెన్షన్ ..టెన్షన్

    ‘‘ఏ సినిమా చేసినా అందులో నేను ఎలా నటించాను? అనే టెన్షన్‌ ఉంటుంది. అదే మహేష్‌ సినిమా అయితే ‘మహేష్‌ పక్కన నేను ఎలా కనిపిస్తా' అనే టెన్షన్‌ మొదలవుతుంది అని సమంత చెప్పుకొచ్చింది

    ఇదే కథ అంటూ సమంత

    ఇదే కథ అంటూ సమంత

    తల్లిదండ్రులు తమ పిల్లల్ని వెతుక్కొంటూ వెళ్లడం మామూలే. కానీ ఈ సినిమాలో పిల్లలు తమ మూలాల్ని వెతుక్కొంటూ చేసే ప్రయత్నం కొత్తగా అనిపించింది. శ్రీకాంత్‌ అడ్డాల మాత్రమే ఇలాంటి సినిమా చేయగలరు''ని సమంత చెప్పింది.

    దర్శకుడు మాట్లాడుతూ...

    దర్శకుడు మాట్లాడుతూ...

    ‘‘ఇంతమంది సీనియర్‌ నటీనటుల మధ్య, సాంకేతిక నిపుణుల మధ్య పనిచేయాలంటే కాస్త బెరుకుగా ఉండేది. మహేష్‌బాబు చిరునవ్వు చూస్తే అది మాయమైపోయేది. ఆయనే నన్ను ముందుకు నడిపించారు. ఆయన నాకిచ్చిన రెండో అవకాశం ఇది. దాన్ని నిలుపుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశా'' అన్నారు.

    మిక్కీ జె.మేయర్‌ చెబుతూ....

    మిక్కీ జె.మేయర్‌ చెబుతూ....

    ‘‘నెలల తరబడి ఈ పాటల కోసం కష్టపడ్డాం. పాటలు రాసిన వాళ్లకూ, పాడిన వాళ్లకూ కృతజ్ఞతలు. మహేష్‌బాబు సినిమాకి సంగీతం అందించడం ఇది రెండోసారి. ఆయనతో పనిచేయడం ఓ గౌరవం. ఈ సినిమాలో చాలామంది గొప్ప నటీనటులున్నారు. రేవతి గారికి నేను పెద్ద అభిమానిని. ఈ పాటలు అందరికీ నచ్చుతాయన్న నమ్మకం ఉంది''అన్నారు.

    పీవీపీ మాట్లాడుతూ...

    పీవీపీ మాట్లాడుతూ...

    ``బ్ర‌హ్మోత్స‌వం మాకు మ‌రింత ముఖ్య‌మైన ఉత్స‌వం. పిలిచిన వారంద‌రూ రావ‌డం చాలా ఆనందంగా ఉంది. మ‌హేష్‌బాబుగారు వారి కుటుంబంతో ఒక ఉత్స‌వం చేయ‌డానికి ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. సంగీతోత్సవం అనే ఈ వేడుక‌ను అంటున్నాం`` అని అన్నారు.

    విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ...

    విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ...

    ``టైటిల్ చాలా బావుంది. ఈ టైటిల్‌లాగానే ఈ సినిమా త‌ప్ప‌కుండా 100 రోజులు ఆడుతుంద‌నే న‌మ్మ‌కం నాకుంది`` అని అన్నారు.

     స‌త్య‌రాజ్ మాట్లాడుతూ...

    స‌త్య‌రాజ్ మాట్లాడుతూ...

    ``ఈ సినిమాలో స్టోరీ, ద‌ర్శ‌కుడు, న‌టీన‌టులు అంద‌రూ బావున్నారు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్ల‌మ్ ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంది. 40 ఏళ్ల క్రితం నేను బీఎస్సీ చ‌దువుతున్న‌ప్పుడు నాకు ఇంగ్లిష్ రాక‌పోతే మా మాస్ట‌ర్ న‌న్ను చూసి `డిగ్రీ చ‌దువుతూ ఇంగ్లిష్ ఎందుకు రాదురా?` అని అడిగారు. అందుకు నేను `సార్ చెన్నై నుంచి 500 కిలోమీట‌ర్ల‌లో ఆంధ్రా ఉంది. నాకు తెలుగే రాదు. 5వేల కిలోమీట‌ర్లున్న లండ‌న్‌లోని ఇంగ్లిష్ ఎలా వ‌స్తుంది` అని అన్నా. జోకులు త‌ర్వాత కానీ ఈ సినిమాలో న‌టించినందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

    రేవ‌తి మాట్లాడుతూ...

    రేవ‌తి మాట్లాడుతూ...

    ``ఈ టీమ్‌తో క‌లిసి ప‌నిచేసినందుకు ఆనందంగా ఉంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా ఒక ఉత్స‌వం. షూటింగ్‌లోనూ ఉత్స‌వంలాగానే అనిపించింది. ఇందులో కుటుంబ విలువ‌లు ఉన్నాయి. షూటింగ్‌లోనూ న‌వ్వులున్నాయి. ఎమోష‌న్స్ ఉన్నాయి. గొడ‌వ‌లున్నాయి. క‌న్నీళ్లున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ చివ‌రికి అంద‌రికీ మంచి పేరు తెచ్చిపెడుతుంద‌నే న‌మ్మ‌కంతో ప‌నిచేశాం`` అని చెప్పారు.

    సుధీర్‌బాబు మాట్లాడుతూ....

    సుధీర్‌బాబు మాట్లాడుతూ....

    ``తిరుప‌తిలో గోవిందా గోవిందా అని మారుమోగుతుంటుంది. ఇక్క‌డ ఈ బ్ర‌హ్మోత్స‌వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ అనే పేరు మారుమోగుతోంది. అక్క‌డ తిరుప‌తిలో హుండీలో భ‌క్తులు కానుక‌ల వ‌ర్షం కురిపిస్తుంటారు. ఇక్క‌డ ఈ సినిమా హుండీలో కాసుల వ‌ర్షం కుర‌వాలని వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడిగా కోరుకుంటున్నా. ఈ మ‌ధ్య‌లో సినిమాల్లో బ్యాడ్‌బోయ్‌గా మారా. బ్యాడ్ బోయ్ ని అయినా పీవీపీగారు పిలిచారు`` అని తెలిపారు.

    బ్యూటీఫుల్ టీమ్

    బ్యూటీఫుల్ టీమ్

    ``మంచి టీమ్ తో ప‌నిచేశా. అమేజింగ్ ఆర్టిస్ట్స్, మంచి టెక్నీషియ‌న్స్ తో చేయ‌డం ఆనందంగా ఉంది. నా పాత్ర చాలా బావుంది. ఇది బ్యూటీఫుల్ కేర‌క్ట‌ర్‌. ఇందులో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ సినిమా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు.

    వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ....

    వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ....

    ``శ్రీకాంత్‌గారు చేసింది త‌క్కువ చిత్రాలే అయినా త‌న‌కంటూ ఒక మార్కు వేసుకున్నారు. పీవీపీ గురించి అనుకున్న‌ప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మ‌హేష్‌గారిని నేను చాలా ఆరాధిస్తాను. ఆయ‌న ప‌ని, ఆయ‌న ప్యాష‌న్‌, ఆయ‌న గ‌ట్స్ అన్నిటినీ చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నాం. సూప‌ర్ స్టార్‌డ‌మ్ ఉన్న ఒక హీరో ఒక చోట ఆగిపోతే దాన్ని దాటి మ‌హేష్ మ‌రో గీత గీస్తారు.

    మహేష్ కు గట్స్ ఉన్నాయి

    మహేష్ కు గట్స్ ఉన్నాయి

    సీత‌మ్మ వాకిట్లో చిత్రంతో ఎప్పుడో ఆగిపోయిన మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్‌ను మ‌ర‌లా మొద‌లుపెట్టారు. క్యారక్ట‌ర్‌ను న‌మ్మి శ్రీమంతుడు చేశారు. చెప్పుల‌ను ఒక కాలికి తొడుగుతూ వ‌చ్చిన బ్ర‌హ్మోత్స‌వం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి చాలా గ‌ట్స్ ఉండాలి. సినిమా రిజ‌ల్ట్ ఏదైనా అందుకు నేను కూడా ఒక బాధ్యుడినే అని మ‌హేష్ చెప్ప‌డం మ‌ర్చిపోలేను`` అని చెప్పారు వంశీ పైడిపల్లి

    జ‌య‌సుధ మాట్లాడుతూ...

    జ‌య‌సుధ మాట్లాడుతూ...

    ``బ్ర‌హ్మోత్స‌వం చాలా బాగా జ‌రిగింది. అమేజింగ్ జ‌ర్నీ. శ్రీకాంత్‌తో నాకు ఇది మూడో సినిమా. కొత్త‌బంగారులోకం, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వం చేశాం.

    కళ్లమ్మట నీళ్లు వచ్చాయి

    కళ్లమ్మట నీళ్లు వచ్చాయి

    ఈ సినిమాలో క్లైమాక్స్ స‌న్నివేశంలో మ‌హేశ్ చేస్తున్న‌ప్పుడు నాక‌ళ్ల‌మ్మ‌ట నీళ్లొచ్చాయి. న‌టిగా ఇప్ప‌టిదాకా ఎన్నో ఎమోష‌న‌ల్ పాత్ర‌ల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఈ సినిమా క్లైమాక్స్ సీన్ నాకు గుర్తుండిపోతుంది`` అని అన్నారు.

    స‌మంత మాట్లాడుతూ...

    స‌మంత మాట్లాడుతూ...

    `` ఈ సినిమాలో సీనియ‌ర్ ఆర్టిస్ట్ ల‌తో ప‌నిచేసినందుకు ఆనందంగా ఉంది. మిక్కీ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా పేరులాగానే థియేట‌ర్ల‌లో ఉత్స‌వం ఉంటుంది. ఆ సెల‌బ్రేష‌న్ చూడ‌టానికి నేను ఎదురుచూస్తున్నాను`` అని తెలిపారు.

    న‌రేష్ మాట్లాడుతూ...

    న‌రేష్ మాట్లాడుతూ...

    ``మ‌హేష్ తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంటుంది. త‌ను కంప్లీట్ మేన్ మాత్ర‌మే కాదు, ప‌ర్ఫెక్ష‌నిస్ట్. త‌న‌తో ప‌నిచేయ‌డం చాలా థ్రిల్ గా ఉంటుంది. త‌న సినిమాలో ఎప్పుడు క‌నిపిస్తానా అని చాలా మంది ఫ్యాన్స్ అడిగారు. ఈ చిత్రంతో చాలా హ్యాపీగా అనిపించింది.

    అప్పట్లో ఇప్పుడు మళ్లీ

    అప్పట్లో ఇప్పుడు మళ్లీ

    ఈ సినిమాను ద‌ర్శ‌క‌త్వం చేయాలంటే శ్రీకాంత్ వ‌ల్ల‌నే సాధ్యం. నెక్స్ట్ జ‌న‌రేష‌న్ ప్రొడ్యూస‌ర్ ఆయ‌న‌. పండంటి కాపురం సినిమా సెట్‌లో చూసిన పండుగ వాతావ‌ర‌ణాన్ని మ‌ర‌లా ఈ సినిమా సెట్‌లో చూశాను. బ్రహ్మోత్స‌వం క‌లెక్ష‌న్స్ తిరుమ‌ల ఒక్క సంవ‌త్స‌రం క‌లెక్ష‌న్ల‌ను దాటాలి. ఇళ‌య‌రాజా త‌ర్వాత నాకు మిక్కీ సంగీతం అంటే చాలా ఇష్టం`` అని నరేష్ చెప్పారు.

    తోట త‌ర‌ణి మాట్లాడుతూ ....

    తోట త‌ర‌ణి మాట్లాడుతూ ....

    ``ల‌వ్ లీ ప్రొడ‌క్ష‌న్‌, క్రూ, యాక్ట‌ర్స్ క‌లిసి చేసిన సినిమా. టెక్నీషియ‌న్స్ చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. నా వ‌ర్క్ ను ర‌త్న‌వేలు చాలా బాగా చూపించారు. మంచి పిక్చ‌ర్ ఇది`` అని చెప్పారు.

    ర‌త్న‌వేలు మాట్లాడుతూ.....

    ర‌త్న‌వేలు మాట్లాడుతూ.....

    ``శ్రీకాంత్ చ‌క్క‌టి స్క్రిప్ట్ రాశారు. ఈ సినిమా కుటుంబంతో ప‌నిచేయ‌డం ఆనందంగా అనిపించింది. ఇందులో ఫ్యూజ‌న్ విజ‌న్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాను. మిక్కీ పాట‌లు బావున్నాయి. త‌ర‌ణిగారి సెట్లు చాలా బావుంటాయి.

    అత్యంత అందగాడు

    అత్యంత అందగాడు

    మ‌హేష్‌గారు ఎప్పుడూ త‌న లుక్స్ తో ఎక్స‌యిట్ చేస్తుంటారు. నా కెమెరా ఇప్ప‌టిదాకా చిత్రీక‌రించిన వాళ్ల‌లో అత్యంత అంద‌గాడు మ‌హేష్‌. పీవీపీగారు చాలా ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి`` అని రత్నవేలు చెప్పారు.

    వినయంగా ఉండాలని

    వినయంగా ఉండాలని

    శ్రీకాంత్ మాట్లాడుతూ `` బ్ర‌హ్మోత్స‌వం అని టైటిల్ పెట్టిన‌ప్పుడు తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి పాదాల‌ని దృష్టిలో పెట్టుకుని, అంత‌టి విన‌యంగా ఉండాల‌ని అనుకున్నా. ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను కూడా విలువ‌ల‌ను గుర్తుపెట్టుకునే ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను.

    ధాంక్స్

    ధాంక్స్

    తోట త‌ర‌ణిగారు ప‌నిచేస్తే ఆ సినిమాతో ద‌ర్శ‌కుడు ఇంకో లెవ‌ల్‌కి వెళ్లిన‌ట్టే అని నా ఫ్రెండ్ అని అన్నారు. సెట్లో అంద‌రం క‌లిసి భోజ‌నం చేసేవాళ్లం. అప్పుడు ప‌ది మందికి క‌లిపి పెట్ట‌డం తోట‌త‌ర‌ణిగారి ద‌గ్గ‌ర నేర్చుకున్నా. నేను బాడీ అయితే మిక్కీ సోల్‌. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్యవాదాలు`` అని చెప్పారు అని శ్రీకాంత్ అడ్డాల చెప్పారు

    ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మాట్లాడుతూ....

    ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మాట్లాడుతూ....

    ``మాకు ఇద్ద‌రు దేవుళ్లు. వాళ్ల‌లో ఎన్టీఆర్ ఒక‌టైతే, రెండోది కృష్ణ‌గారు. కృష్ణ‌గారి పేరును నిల‌బెడుతున్నారు మ‌హేష్‌.

    సకల జబ్బులకు

    సకల జబ్బులకు

    శ్రీకాంత్ స్కూలు అని ఈ మ‌ధ్య కొత్త స్కూలు మొద‌లైంది. విలువ‌ల‌కు, మాన‌వ‌త్వానికి ఆయ‌న స్కూల్లో ప్రత్యేక చోటు ఉంటుంది. ఒక‌ప్పుడు చాలా గొప్ప సంస్థ‌లు ఉండేవి. అలాంటి సంస్థ‌ల స్థానాన్ని పీవీపీ సంస్థ ఆక్ర‌మించాలి. ఈ సినిమా స‌క‌ల జ‌బ్బుల‌ను న‌యం చేస్తుంది`` అని పరుచూరి బ్రదర్శ్ చెప్పారు.

    వీళ్లంతా..

    వీళ్లంతా..

    ఈ ఆడియో పంక్షన్ లో నమ్రత, విజయనిర్మల, నరేష్‌, రావు రమేష్‌, సుధీర్‌బాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, ప్రణీత, జయసుధ, రేవతి, సత్యరాజ్‌, వంశీ పైడిపల్లి, రత్నవేలు, తోట తరణి, కె.ఎస్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.

    rn

    ఆడియో లాంచ్ వీడియో

    ఈ ఆడియో లాంచ్ ని వీడియో రూపంలో మీరు ఇక్కడ చూడవచ్చు.

    rn

    ట్రైలర్

    ఈ చిత్రం ఆడియో విడుదల సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.

    English summary
    The audio launch of superstar Mahesh Babu's "Brahmotsavam" held in Hyderabad on Saturday. Written and directed by Srikanth Addala, "Brahmotsavam" is the most-talked about family entertainer film of 2016 and it is produced with a whopping budget of Rs. 75 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X