»   » ‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబు కూతురు?

‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబు కూతురు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ ఇప్పటికే ‘1 నేనొక్కడినే' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాలో గౌతం తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. 9 ఏళ్ల వయసులో అబ్బుర పరిచే నటన కనబర్చిన గౌతం మా టీవీ అవార్డు కూడా అందుకున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కూతురు ‘సితార' కూడా త్వరలో వెండి తెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం'లో సితార ఓ చిన్న పాత్రలో కనిపించనుందట. మహేష్ బాబు కూడా చిన్న వయసులోనే తన తండ్రి నటించిన చిత్రాల్లో నటిస్తూ వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.


Mahesh Babu's Daughter Sitara To Appear In Brahmotsavam

ప్రస్తుతం సితార వయసు కేవలం 4 సంవత్సరాలు మాతమే. ఇటీవల మాటీవీ అవార్డుల పంక్షన్లో తన ఫ్యామిలీతో కలిసి హాజరై అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవం సినిమా ద్వారా సితారను వెండి తెరపై చూడటం అంటే అభిమానులకు పండగ అనే చెప్పాలి. అయితే సితార నటించే విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


బ్రహ్మోత్సవం వివల్లోకి వెళితే...శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు.

English summary
Mahesh Babu's son Gautham Krishna already impressed the movie goers with his acting debut, 1 Nenokkadine. The 9-year-old played the role of little Mahesh in the film and has even received MAA award for his performance.
Please Wait while comments are loading...