»   » మహేష్ బాబు డైట్ సీక్రెట్స్ బట్టబయలు!

మహేష్ బాబు డైట్ సీక్రెట్స్ బట్టబయలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వచ్చిన '1-నేనొక్కడినే' చిత్రంలో యంగ్ లుక్ తో, స్లిమ్ గా పాతికేళ్ల కుర్రాడిలా కనిపించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇంత గొప్పగా తన బాడీ ఎలా మెయింటేన్ చేస్తున్నాడనే విషయం బట్ట బయలైంది.

ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు. షూటింగులకు వెళ్లినపుడు కూడా ఇలాంటి ప్రత్యేకమైన ఫుడ్ వండి పెట్టేందుకు స్పెషల్ గా ఓ వంట వాడిని కూడా నియమించుకున్నారు. '1' సినిమా కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడి తన ఫిజిక్ ను ఆకర్షణీయంగా మార్చుకున్నారు. ఆ ఫిజిక్ అలానే మెయింటేన్ చేయడానికే హైదరాబాదుకు చెందిన ఫేమస్ చెఫ్ ' ఇనామ్' ను మహేష్ భార్య నమ్రత నియమించిందట.

 Mahesh Babu's diet secrets

ఇనామ్ మహేష్ బాబు కోసం దాదాపు సంవత్సరంన్నర నుండి పని చేస్తున్నాడట. మహేష్ ఎక్కడికి వెళితే అక్కడికి ఇప్పుడు ఇనామ్ వెళుతూ, మహేష్ కి కావలసిన ప్రత్యేకమైన ఆహారాన్ని సమకూరుస్తున్నాడట. ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' షూటింగులోలో ఉన్నారు. లడఖ్ లో ఈచిత్రం షూటింగ్ జరుగుతోంది.

ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

English summary
“I’ve been associated with him for over one and a half years now. Namrata had got in touch with me. She personally looks after his diet and when she found that I prepare healthy food, she asked if I could do the same for Mahesh.” Mahesh babu's chef Inam said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu