For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాన్న గారు నా భుజం తట్టి.. ఆ రోజును ఎప్పటికీ మరచిపోలేను.. ఎమోషనల్ అయిన మహేష్ బాబు

|
Mahesh Babu Mass Speech At Sudarshan 35mm || Filmibeat Telugu

మే 9 వ తేదీన విడుదలైన మహేష్ బాబు మహర్షి మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఈ సినిమాలో నటించిన నటీనటులంతా ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. యూనిట్ సభ్యులంతా పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ మహర్షి సినిమా విశేషాలను అందరితో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చిత్రయూనిట్‌తో కలిసి హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ సందర్శించారు మహేష్ బాబు. ఆయన రాకతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. ఈ సందర్భంగా మహేష్ తన గత సినిమా అనుభవాలను నెమరు వేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ విశేషాలు చూస్తే..

చాలా ఏళ్ల తర్వాత

సుదర్శన్ థియేటర్‌కి వచ్చి చాలా ఏళ్ళయిందని, మళ్ళీ ఇన్నాళ్లకు మా అందరి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని మహేష్ అన్నారు. గతంలో మహేష్ నటించిన పలు సినిమాలు ఇదే థియేటర్‌లో విడుదలై సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టాయి. ఆ సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు మహర్షి రూపంలో మరో హిట్ తన ఖాతాలో పడటం, మరల ఈ థియేటర్‌ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని మహేష్ పేర్కొన్నారు.

నాన్న గారు భుజం తట్టి..


మహేష్ కెరీర్‌లో టర్నింగ్ మూవీ మురారి. ఈ సినిమా అందించిన విజయం ఆయనకు మంచి పుషింగ్ ఇచ్చింది. అయితే అప్పట్లో మురారి చిత్రాన్ని నాన్నతో కలిసి ఇదే సుదర్శన్ థియేటర్‌లో చూశానని, సినిమా చూసిన నాన్న గారు తన భుజంపై చేయి వేసి అభినందించారని మహేష్ అన్నారు. ఆ రోజులు ఎప్పటికీ మరచిపోలేనని మహేష్ పేర్కొన్నారు.

ఇదే నా సొంత థియేటర్..

ఇటీవలే ఏఎంబీ పేరుతో మహేష్ బాబు భారీ మల్టిప్లెక్స్ థియేటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ సుదర్శన్ థియేటర్‌నే తన సొంత థియేటర్‌గా భావిస్తున్నానని మహేష్ చెప్పగానే అభిమానుల ఈలలు, కేరింతలతో సుదర్శన్ థియేటర్ ప్రాంగణం హోరెత్తిపోయింది. తన కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సినిమాలన్నీ ఈ థియేటర్ లోనే విడుదలయ్యాయని అందుకే సుదర్శన్‌తో తనకు ప్రత్యేక అనుబంధముందని మహేష్ అన్నారు.

మరోసారి కాలర్ ఎగరేస్తున్నా


మహర్షి రూపంలో ఇంత పెద్ద విజయాన్నందించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ ఆశీస్సులు, అభిమానం నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నా సినిమా కెరీర్‌లో ఈ రోజు పొందిన ఆనందం ఎప్పటికీ మరపురానిది. మీ అందరి కోసం మరోసారి కాలర్ ఎగరేస్తున్నా అని మహేష్ ఎమోషనల్ అవుతూ మాట్లాడారు.

కెరీర్‌లో ఓ మైలురాయిగా


విడుదలైన అన్ని సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న మహర్షి మూవీ మహేష్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిన మహర్షి నిర్మాతలకు లాభాల పంట పండిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్రాల్లో మహర్షి హవా మామూలుగా లేదు.

మహర్షి

మహేష్ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ సినిమాగా మహర్షి తెరకెక్కింది. వంశీ పైడిపెల్లి టేకింగ్, ముగ్గురు నిర్మాతల నిర్మాణ విలువలు ప్రేక్షక లోకాన్ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి. చిత్రంలో మహేష్ బాబు, పూజా హెగ్డే కెమిస్ట్రీ చూసి ఫిదా అవుతున్నారు జనం. అలాగే మహేష్ ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

English summary
Mahesh Babu's Maharshi is running successfully with creating new records in his career. This movie crossed Rs.100 crores already. In this occation the mahrshi unit visits sudarshan theater in hydearabad. Mahesh gets emotional and says some momeries with sudarshan theater.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more