»   » మురుగదాస్ మూవీ.... మహేష్ బాబు లుక్ ఇదే!

మురుగదాస్ మూవీ.... మహేష్ బాబు లుక్ ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ద్విబాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి సౌత్ పాపులర్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పని చేస్తున్నారు.

మహేష్ బాబుతో పని చేయడం గురించి ఆయన మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. మహేష్ బాబుతో పని చేయడం హ్యాపీగా ఉందనన్నారు. మహేష్ బాబు స్టార్ పవర్ అపారం, అపరిమితం అని సంతోష్ శివన్ పొగర్తలతో ముంచెత్తారు.

తాజాగా సెట్స్ లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటో ఒకటి సంతోష్ శివన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయగా... మహేష్ బాబు కూడా దాన్ని తన ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు షేర్ చేసారు. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ బయటకు రావడం ఇదే తొలిసారి.

డిఫరెంట్ లుక్

డిఫరెంట్ లుక్

ప్రతి సినిమాకు మహేష్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమా విషయంలో కూడా తన లుక్ గత సినిమా కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు.

ప్రియదర్శి పులికొండ

ప్రియదర్శి పులికొండ

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో పెళ్లి చూపులు మూవీ కమెడియన్ ప్రియదర్శి పులికొండ ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ వెంట కనిపించే ఓ పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు.

హీరోయిన్

హీరోయిన్

ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మహేష్ బాబుతో ఆమెకు ఇది తొలి సినిమా. గతంతో రకుల్ కు మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినా డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్ల చేయలేక పోయానే అనే అసంతృప్తిగా ఉండేది. అయితే వెంటనే ఆమెకు మరో ఛాన్స్ దొరకడంపై సంతోషంగా ఉంది.

సూర్య ఎస్.జె

సూర్య ఎస్.జె

ఈచిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

English summary
Ace cameraman Santosh Sivan took a picture of Mahesh babu and Mahesh babu also shared it on his Twitter too last night and it garnered several likes already. Cinematographer-filmmaker Santosh Sivan, who is busy working on A.R. Murugadoss's yet-untitled Tamil-Telugu bilingual, says the excitement Mahesh Babu's presence brings to a set is beyond belief.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu