»   » మహేష్ బాబుతో సినిమా ప్రకటించిన అశ్వినీదత్

మహేష్ బాబుతో సినిమా ప్రకటించిన అశ్వినీదత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి తిరుమల వచ్చిన సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ ఈ సినిమా గురించిన విషయాలు వెల్లడించారు. నవంబర్లో మహేష్ బాబుతో సినిమా మొదలు పెడుతున్నట్లు తెలిపారు. మైత్రి మూవీస్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కనుంది. ఆగడు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

Mahesh Babu’s new film in November

మహేష్ బాబు ప్రస్తుతం 'ఆగడు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

English summary
Ashwini Dutt, along with his family visited Tirumala on Sunday. Speaking to media in the temple premises, Ashwini Dutt stated that a new film with Mahesh Babu will start in the month of November.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu