»   » మహేశ్‌ లుక్ అదిరింది.. వియత్నాంలో హాలీవుడ్ స్థాయిలో.. ఉగాదిన శుభవార్త

మహేశ్‌ లుక్ అదిరింది.. వియత్నాంలో హాలీవుడ్ స్థాయిలో.. ఉగాదిన శుభవార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో ప్రిన్స్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించిన విరోచిత సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ వియత్నాంకు బయలుదేరి వెళ్లింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సీన్లను వియత్నాం పరిసర ప్రాంతాల్లో షూట్ చేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం మార్చి 22 తేదీన వియత్నాంకు బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తున్నది.

సంతోష్ శివన్ ట్వీట్..

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల చెన్నైలో పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రీకరించిన సన్నివేశాల్లోని మహేశ్ ఫోటోను సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ట్వీట్ చేశారు.

వియత్నాంలో రెండోసారి

వియత్నాంలో రెండోసారి

ఇంకా పేరు పెట్టని చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయింది. వియత్నాంలోని ప్రధాన ప్రాంతాల్లో రెండువారాల పాటు ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తాం. వియత్నాంలో దక్షిణాది చిత్రం షూటింగ్ జరుపుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు జయం రవి నటించిన వనమాగన్ చిత్రాన్ని వియత్నాంలో షూట్ చేశారు.

కనీవిని ఎరుగని రీతిలో..

కనీవిని ఎరుగని రీతిలో..

గతంలో కనీవిని ఎరుగని రీతిలో యాక్షన్ సీన్లను షూట్ చేయనున్నాం. ఇందులో ప్రధానంగా ఛేజింగ్ సీన్ చాలా ముఖ్యమైనది. హాలీవుడ్ స్ఠాయికి తగినట్టు ఫైట్స్‌ను కంపోజ్ చేయనున్నాం. వియత్నాంకు చెందిన ఫైట్ మాస్టర్ యాక్షన్ సీన్లను డైరెక్షన్ చేస్తున్నారు. ఏప్రిల్ రెండోవారంలో యూనిట్ తిరిగి వస్తుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

 ఉగాదిన ఫస్ట్‌లుక్

ఉగాదిన ఫస్ట్‌లుక్

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది పర్వదినం రోజున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నది. ఈ చిత్రానికి సంభవామి, ఏజెంట్ శివ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 జూన్ 23న విడుదల

జూన్ 23న విడుదల

మహేశ్ బాబు ఈ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్‌ పాత్రను పోషిస్తున్నది. ఖుషీ దర్శకుడు సూర్య విలన్‌గా కనిపిస్తారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 23న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్నది.

English summary
Mahesh Babu’s next is with ace director AR Murugadoss. The team of this film, which is still being shot, left for Vietnam to shoot some crucial action sequences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu