»   »  మరో రికార్డు క్రియేట్ చేసిన మహేష్ బాబు

మరో రికార్డు క్రియేట్ చేసిన మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'కొలంబస్‌', 'ది ప్రిన్స్‌', 'ఆచార్య', 'సునామీ...' - ఇలా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి మహేష్‌బాబు నటిస్తున్న సినిమాకి. ఈ ప్రచారపర్వానికి తెర దించుతూ సినిమా పేరుని ప్రకటించారు.

'1' అనే అంకెను ఈ చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించారు. 'నేనొక్కడినే' అనేది ఉపశీర్షికగా ఉంటుంది. ఈ టీజర్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. చిత్ర నిర్మాత అనీల్ సుంకర ఈ విషయం డిక్లేర్ చేస్తూ... ట్రైలర్ వదిలిన 24 గంటల్లో... 2.7 లక్షల వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసిందని చెప్పారు.

అలాగే.. 3,35,000 హిట్స్ తో ఈ సంఖ్య క్షణ క్షణానికి పెరుగుతోందని అని అన్నారు. ఇక 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతి సనన్‌ హీరోయిన్ గా పరిచయమవుతోంది. సుకుమార్‌ దర్శకుడు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు.

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం మహేష్‌బాబు సినిమాకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. దీనికి వచ్చిన స్పందన పట్ల మహేష్‌బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

''పేరుకు మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల అంచనాలను అందుకొనేందుకు చిత్రబృందం సమష్టిగా కృషి చేస్తోంది. నా సినీ జీవితంలో '1' ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. నాపై చూపుతున్న అభిమానానికి, అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు'' అన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

English summary
The latest teaser of Mahesh Babu seems to have set a new record in terms of online views. Producer turned director Anil Sunkara declares that the trailer is has received a record 2.7 lakh views since in 24 hours since it was released. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu