»   » మహేష్ బాబు ‘స్పైడర్’ షూటింగ్ సీన్లు లీక్ (వీడియో)

మహేష్ బాబు ‘స్పైడర్’ షూటింగ్ సీన్లు లీక్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' మూవీ షూటింగ్ వీడియో ఒకటి లీకైంది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్ల చిత్రీకరణకు సంబంధించిన ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది.

లీకైన వీడియో చూస్తుంటే సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు అభిమానులను ఓ రేంజిలో అలరించనున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఎస్.జె.సూర్య నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు.


లీకైన వీడియో ఇదే

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'.


ఊహించని స్పందన

ఊహించని స్పందన

మహేష్‌, మురుగదాస్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. ఇటీవల విడుదలైన టీజరకు ఎవరూ ఊహించని విధంగా భారీ స్పందన వచ్చింది. దీన్ని బట్టి సిపిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


హై టెక్నికల్‌ స్టాండర్డ్స్

హై టెక్నికల్‌ స్టాండర్డ్స్

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న 'స్పైడర్‌' చిత్రం సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లోనే ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుందని టీజర్‌ని చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


స్పైడర్

స్పైడర్

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.English summary
Super Star Mahesh Babu has completed the regular shoot of Spyder. The makers of the movie are currently busy in post-production work. Mahesh Babu will be seen playing as an intelligence officer in the movie. Some of Spyder scenes got leaked and they are going viral on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu