»   » మహేష్ బాబు స్టార్ పవర్ అపారం, అపరిమితం!

మహేష్ బాబు స్టార్ పవర్ అపారం, అపరిమితం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ద్విబాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి సౌత్ పాపులర్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పని చేస్తున్నారు.

మహేష్ బాబుతో పని చేయడం గురించి ఆయన మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. మహేష్ బాబుతో పని చేయడం హ్యాపీగా ఉందనన్నారు. మహేష్ బాబు స్టార్ పవర్ అపారం, అపరిమితం అని సంతోష్ శివన్ పొగర్తలతో ముంచెత్తారు.

గత మూడు వారాలుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నైలో దాదాపు 20 రోజులు షూటింగ్ జరిపాము. ఈ షూట్లో సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ కవరైంది. బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది, కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయన్నారు.

డిసెంబర్ రిలీజ్

డిసెంబర్ రిలీజ్

ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు.

 పెళ్లి చూపులు కమెడియన్

పెళ్లి చూపులు కమెడియన్

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో పెళ్లి చూపులు మూవీ కమెడియన్ ప్రియదర్శి పులికొండ ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ వెంట కనిపించే ఓ పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మహేష్ బాబుతో ఆమెకు ఇది తొలి సినిమా. గతంతో రకుల్ కు మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినా డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్ల చేయలేక పోయానే అనే అసంతృప్తిగా ఉండేది. అయితే వెంటనే ఆమెకు మరో ఛాన్స్ దొరకడంపై సంతోషంగా ఉంది.

నమ్రత.. రూమరా? నిజమా?

నమ్రత.. రూమరా? నిజమా?

నమ్రత ఈ చిత్రంలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా గెస్ట్ రోల్ చేస్తుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

విలన్ పాత్రలో

విలన్ పాత్రలో

ఈచిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

English summary
Cinematographer-filmmaker Santosh Sivan, who is busy working on A.R. Murugadoss's yet-untitled Tamil-Telugu bilingual, says the excitement Mahesh Babu's presence brings to a set is beyond belief. The makers have been shooting in the city for nearly three weeks. "The amount of excitement and energy the presence of Mahesh Babu creates in Chennai is astonishing. The star power is enormous. We have shot close to 20 days in Chennai with some major portions covered. We have got the best of combination that will give this film a great avenue to explore the commercial arena to a greater level," Sivan said in a statement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu