»   » మహేష్ '1 - నేనొక్కడినే ' స్టన్నింగ్ లుక్(లీకెడ్ ఫోటో)

మహేష్ '1 - నేనొక్కడినే ' స్టన్నింగ్ లుక్(లీకెడ్ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం మహేష్‌ నటిస్తున్న సినిమా '1' (నేనొక్కడినే) షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. సుకుమార్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ స్టన్నింగ్ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే. అక్కడ షూటింగ్ లొకేషన్ లో ఫోటో మీరు చూస్తున్నది. ఇది ఈ చిత్రం వర్కింగ్ స్టిల్.

''ఇటీవల విడుదల చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఒక్క రోజులోనే పది లక్షల మంది ఆ టీజర్‌ని వీక్షించారు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది'' అనీల్ సుంకర అన్నారు. మరో ప్రక్క టీజర్‌ వచ్చిన స్పందన పట్ల మహేష్‌బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం '1'. నేనొక్కడినే అన్నది ట్యాగ్ లైన్. కృతి సనన్‌ హీరోయిన్ గా పరిచయమవుతోంది. సుకుమార్‌ దర్శకుడు. ఈ చిత్రంలో విలన్ గా విక్రమ్ సింగ్ నటిస్తున్నాడు. హిందీలో మహేష్ భట్ క్యాంప్ లో య-రాబ్ అనే చిత్రం లో హీరోగా చేస్తున్న విక్రమ్ తెలుగులో విలన్ గా బిజీ అవుతానంటున్నాడు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Watch out the ultra-stylish look of Mahesh who is getting ready to do some death-defying stunts to enthrall his fans. Mahesh Babu has put in a lot of effort to be prepared for the breath taking action sequences in his upcoming flick '1 - Nenokkadine'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu