మహేష్‌బాబు విజన్ ఆఫ్ భరత్.. జనం కోసం, జనం కొరకు.. ఫ్యాన్స్‌కు థ్రిల్లింగ్
Recommended Video

ప్రిన్స్ మహేష్‌బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన విజన్ ఆఫ్ భరత్ ప్రత్యేక టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అభిమానులను థ్రిల్ గురిచేసేలా ప్రిన్స్ విజన్ ఆఫ్ భరత్‌ను రూపొందించారు. రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
విద్యావ్యవస్థలోని లోపాలపై
విజన్ ఆఫ్ భరత్ రిలీజ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలోని లోపాలు, విధానాలపై మహేష్‌బాబు సెటైర్ వేశారు. దేశం వెనుకబడి ఉండటానికి కారణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలోని లోపాల గురించి ఆయన చర్చించే ప్రయత్నం చేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశంగా
భారత దేశం ఇంకా ఎందుకు అభివృద్ది చెందుతున్న దేశంగానే ఉంది. ఇలాంటి పరిస్థితి ఉండటానికి ఎలాంటి అంశాలు అవరోధంగా మారాయి. భారతీయ విద్యా వ్యవస్థ గురించి ఏదైన చదివినప్పుడల్లా ఇలాంటి ప్రశ్నలు నాలో లేస్తుంటాయి.

దేశానికి విద్య ఆయువుపట్టు
దేశం అభివృద్ధి పథంలోకి ప్రయాణించాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దేశ పురోగాభివృద్ధికి విద్యా వ్యవస్థనే ఆయువుపట్టు అని ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

కొరటాల శివతో రెండో సినిమా
శ్రీమంతుడు తర్వాత మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రిన్స్‌కు జంటగా కైరా అద్వానీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.


Click it and Unblock the Notifications











