»   » మహేష్ బాబు, సమంత కలిసి వోడ్కా కొట్టారు! (న్యూ ఫోటోస్)

మహేష్ బాబు, సమంత కలిసి వోడ్కా కొట్టారు! (న్యూ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. ఈ నెల్లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 20న సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ రోజు(మే 7) సాయంత్రం జరిగే ఆడియో వేడుకలో రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఓ వైపు ఆడియో వేడుకకు గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీం పని చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ల కాలంలో ఏదైనా విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రధాన సాధనం సోషల్ మీడియా, వెబ్ మీడియానే కావడంతో దీనిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. సినిమాకు సంబంధించిన స్టిల్స్, వీడియోస్, టీజర్స్, మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేస్తున్నారు.

తాజాగా బ్రహ్మోత్సవం చిత్రానికి సంబంధించి విడుదలైన కొత్త ఫోటోల్లో ఓ పార్టీ సాంగుకు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో మహేష్ బాబు, సమంత కలిసి వోడ్కా షార్ట్స్ కొడుతున్న స్టిల్స్ కూడా ఉండటం విశేషం. మరికొన్ని ఫోటోల్లో పూర్తి ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వాతావరణం. వీటిని బట్టి సినిమాలో యూత్, ఫ్యామిలీస్ ను ఆకట్టుకునే అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారని స్పష్టమవుతోంది.

ఇక సినిమాకు ప్రధాన ఆకర్షణ మహేష్ బాబు. గత సినిమాల కంటే మహేష్ బాబు లుక్ ఈ చిత్రంలో మరింత సూపర్ గా ఉండబోతోంది యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్ తో మహేష్ బాబు మహిళా ప్రేక్షకుల మనసు దేచేస్తున్నారు. తెలుగులో ఎక్కువ అమ్మాయిల ఫోలోయింగ్ ఉన్న హీరో మహేష్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

స్లైడ్ షోలో బ్రహ్మోత్సవం చిత్రానికి సంబంధించని న్యూ ఫోటోస్....

మహేష్-సమంత

మహేష్-సమంత

బ్రహ్మోత్సవం సినిమాలోని ఓ సాంగులో మహేష్ బాబు, సమంత కలిసి వోడ్కా షార్ట్స్ కొడుతున్న దృశ్యం.

హాండ్సమ్ లుక్

హాండ్సమ్ లుక్

ఈ చిత్రంలో మహేష్ బాబు గత సినిమాల కంటే హాండ్సమ్ గా కనిపించబోతున్నారు.

మహేష్, కాజల్

మహేష్, కాజల్

బ్రహ్మోత్సవం చిత్రంలో మహేష్ బాబు, కాజల్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.

ఫ్యామిలీ సెలబ్రేషన్స్

ఫ్యామిలీ సెలబ్రేషన్స్

ఈ సినిమా ఓ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లా పండగ వాతావరణంతో ఉండబోతోంది.

బంధాలు, అనుబంధాలు

బంధాలు, అనుబంధాలు

సినిమాలో బంధాలు, అనుబంధాలకు పెద్ద పీట వసారు.

యూత్ మెచ్చే అంశాలు కూడా

యూత్ మెచ్చే అంశాలు కూడా

సినిమా కేవలం ఫ్యామిలీ ఎంటర్టెనర్ మాత్రమే కాదు... యూత్ మెచ్చే మసాలా కూడా బాగానే దట్టించారు.

English summary
Check out Mahesh Babu's Vodka Shots pics from Brahmotsavam. Mahesh Babu, Samantha, Kajal Aggarwal and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu