»   » హీరో మహేష్, క్రికెటర్ సచిన్‌ల వాయిస్ రికార్డ్ చేసారు

హీరో మహేష్, క్రికెటర్ సచిన్‌ల వాయిస్ రికార్డ్ చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ అయిన ఫరాన్ అక్తర్ స్థాపించిన సోషల్ అవేర్ నెస్ సంస్థ 'మర్డ్' (MARD) కాంపెయిన్ కోసం మహేష్ బాబు వాయిస్ ఇవ్వడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. మర్డ్ అంటే 'మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్'. బాలీవుడ్ ఫేమస్ పాటల రచయిత జావేద్ అక్తర్ ఈ సంస్థ కోసం ఓ కవితని రాశారు.

దాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. తెలుగు వెర్షన్ లో ఈ కవితకి మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. ఇతర భాషల్లోకి కూడా దీన్ని అనువదిస్తున్నారు. అదే విధంగా మరాఠీ భాషలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వాయిస్ ఇచ్చారు. త్వరలోనే వీరి వాయిస్‌ను మనం ప్రచార మాద్యమాల్లో వినబోతున్నాం.

'మర్డ్' సంస్థ ఆంధ్ర‌ప్రదేశ్‌లో ప్రజలందరికీ చేరేలా చేయ్యగలవారు ఎవరా అని కొన్ని రోజులు సర్వే చేసి మరీ....మహేష్ బాబుని ఎంచుకున్నారు. మహేష్ బాబు తెలుగు టాప్ స్టార్లలో ఒకరు కావడంతో పాటు, వివిధ బ్రాండ్లకు యాడ్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వాయిస్‌ అయితేనే కరెక్టర్ అని డిసైడ్ అయ్యారు.

'లింగ అనమానత', దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయాల్ని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే మర్డ్ మొక్క లక్ష్యం. దేశంలోని ఇతర భాషల్లో కూడా 'మర్డ్' ప్రచారం సాగనుంది. ఆయా ప్రాంతాల్లో పాపులర్ స్టార్ల వాయిస్‌ను ఈ కాంపెయిన్ కోసం రికార్డు చేయనున్నారు.స

English summary
Sachin, Mahesh's voices recorded for Bollywood director Farhan Akthar's initiative 'MARD' (Men Against Rape and Discrimination) campaign. In Telugu, Mahesh Babu has rendered his voice and Sachin Tendulkar in Marathi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu