గుండె తరుక్కుపోతున్నది.. హ్యాట్సాఫ్ సోల్జర్స్.. ఉత్తరాఖండ్ ప్రమాదంపై మహేష్, సమంత, రవితేజ్ ట్వీట్స్

ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం సృష్టించిన బీభత్సానికి చమోలీ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. హిమాయల్లో మంచు కొండలు బద్దలు కావడంతో దౌలీ గంగా, రిషి గంగా, అలకానంద నదులు ఉప్పొంగడంతో చోటుచేసుకొన్న విషాదంపై బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, సమంత అక్కినేని, హన్సిక మోత్వానీ, రవితేజ, ఇతర ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియాలో ప్రముఖులు ఏమన్నారంటే..

Recommended Video

Uttarakhand : Mahesh Babu Salutes ITBP Jawans For Their Work | Filmibeat Telugu
మహేష్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి

మహేష్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి

ఇన్స్‌టాగ్రామ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఉత్తరాఖండ్‌లో జల ప్రళయంతో కష్టాల్లో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తుంటే హృదయం ద్రవిస్తున్నది. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మట్టిదిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి ఐటీబీపీకి చెందిన సైనికులు చేస్తున్న కృష్టికి నా బిగ్ సెల్యూట్ అని అన్నారు.

సమంత అక్కినేని ప్రార్థనలు

సమంత అక్కినేని ప్రార్థనలు

హిమాలయ పర్వత శ్రేణుల్లో సంభవించిన హిమపాతం కారణంగా ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకొన్న విషాదంపై సమంత అక్కినేని తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వరద ముంపులో గల్లంతైన 150 మంది సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. రెండు చేతులతో మొక్కుతున్నట్టు ఉన్న ఫోటో పెట్టి తన మెసేజ్‌ను పోస్టు చేశారు.

గుండె తరుక్కుపోయిందంటూ హన్సిక

గుండె తరుక్కుపోయిందంటూ హన్సిక

ఉత్తరాఖండ్‌లో జరిగిన వరద ప్రమాదంపై హన్సిక మోత్వానీ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ ప్రమాద ఘటన వార్త వినగానే నా గుండె తరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో గల్లంతైన ప్రతీ ఒక్కరు క్షేమంగా, సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని హన్సిక తన సందేశాన్ని పోస్టు చేశారు.

మాస్ మహారాజ రవితేజ తీవ్ర దిగ్బ్రాంతి

మాస్ మహారాజ రవితేజ తీవ్ర దిగ్బ్రాంతి

ఉత్తరాఖండ్‌లో ప్రమాద ఘటనకు సంబంధించిన వార్తతో షాక్ గురయ్యానని మాస్ మహారాజా రవితేజ ట్వీట్ చేశారు. వరద ముంపు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకొంటున్నాను. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న అందరూ సురక్షితంగా బయటపడ్డారని భావిస్తున్నాను అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X