»   » తన గ్యాంగ్‌తో మహేష్ బాబు కొడుకు ఇలా.. (ఫోటో)

తన గ్యాంగ్‌తో మహేష్ బాబు కొడుకు ఇలా.. (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. సైకిల్ కాన్సెప్టుతో శ్రీమంతుడు మూవీ బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయిన నేపథ్యంలో గౌతం తన స్నేహితుల గ్యాంగ్ తో కలిసి సైకిల్ పై దర్శనమివ్వడం ఆకట్టుకుంటోంది.

ఆ సంగతి పక్కన పెడితే ఈ నెలలోనే గౌతం కృష్ణ పుట్టినరోజు వేడుక జరుగనుంది. మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ దంపతులకు ఆగస్టు 31, 2006న గౌతం కృష్ణ జన్మించాడు. మమేష్ బాబు నటించిన '1(నేనొక్కడినే)' చిత్రం ద్వారా గౌతం కృష్ణ తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి గౌతం పుట్టిన రోజు వేడుకలను కూడా మహేష్ బాబు అభిమానులు చేయడం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మహేష్ బాబు అభిమానులు గౌతం కృష్ణ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Mahesh Babu son Goutham with his friends

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు సినిమారంగంలోకి ప్రవేశిస్తే....మహేష్ బాబు నట వారసుడిగా గౌతం కృష్ణ తెరంగ్రేటం చేసారు. మహేష్ బాబు తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినట్లే, గౌతం కూడా తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా వెండి తెరకు పరిచయం కావడం గమనార్హం. ఇప్పటి నుండే గౌతం సినిమా కెరీర్‌కు బాటలు వేయడం ద్వారా భవిష్యత్‌లో మంచి నటుడిగా ఎదుగుతాడు అనేది మహేష్-నమ్రత దంపతుల ఆలోచనగా కనిపిస్తోంది.

హేష్ బాబుది ముచ్చటైన ఫ్యామిలీ. తన సహచర నటి నమ్రతను మహేష్ బాబు ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి గౌతం, సితార పిల్లలు జన్మించారు.

English summary
Srimanthudu Style: Mahesh Babu son Goutham with his friends.
Please Wait while comments are loading...