»   » శ్రీమంతుడు: మహేష్ బాబు లుక్ సూపర్బ్....(ఫోటోస్)

శ్రీమంతుడు: మహేష్ బాబు లుక్ సూపర్బ్....(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ‘శ్రీమంతుడు' పేరుతో పిలుస్తున్నారు. త్వరలో అఫీషియల్ టైటిల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ గత సినిమాల కంటే భిన్నంగా....అదిరిపోయేలా ఉండబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఈ చిత్రంలో మహేష్ బాబు అమ్మ పాత్రలో సుకన్య నటిస్తోంది. హీరోయిన్ గా శృతి నటిస్తోంది. బెంగాళి భామ..అంగానా రాయ్ కూడా ఇందులో నటిస్తోంది. హీరోయిన్ గా కాకుండా...ఓ కీలకమైన పాత్ర కోసం ఆమెన తీసుకున్నారని సమాచారం.


ప్రస్తుతం ఈ చిత్రం మలేసియాలో చిత్రీకరణ జరుగుతోంది. మలేషియా షూటింగుకు సంబంధించిన సుకన్య ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మహేష్‌, శ్రుతి, జగపతిబాబు తదితరులపై ఏప్రిల్ 22 వరకూ అక్కడే కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు.


దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


స్లైడ్ షోలో ఫోటోలు...


బిజినెస్ అదిరిపోతోంది

బిజినెస్ అదిరిపోతోంది

ఈ చిత్రాన్ని 8.1 కోట్లకు ఓవర్ సీస్ రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. ఈ రేటు ఆల్ టైమ్ రికార్డు ప్రైస్ గా చెప్తున్నారు. నిర్మాత పార్టనర్ నవీన్...ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మహేష్ కు ఓవర్ సీస్ లో పెరిగిన బిజినెస్ దృష్ట్యా ఈ రేటు పలికినట్లు తెలుస్తోంది.


డైలాగులు లీక్

డైలాగులు లీక్

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. ‘మనుషుల్లో మంచి పోయి క్రూరత్వమే మిగిలింది సార్........ అనే డైలాగుతో పాటు ‘నీకు హెడ్ వెయిట్ ఉంటే...నాకు హ్యాండ్ వెయిట్ ఎక్కువ...చూస్తావా' అనే డైలాగులు లీకైనట్లు తెలుస్తోంది.


ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఫ్యామిలీ ఎంటర్టెనర్

మహేష్‌బాబు సినిమా అంటేనే ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుంది. కుర్రకారుకి నచ్చే యాక్షన్‌, పెద్దవాళ్లని మెప్పించే భావోద్వేగాలూ, అందరూ ఇష్టపడే వినోదం... ఇలా దేనికీ లోటు చేయరు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే ‘శ్రీమంతుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని అంటున్నారు.


మహేష్ బాబు

మహేష్ బాబు

ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఓ ప్లే బోయ్ అని, పుట్టుకతోనే ధనవంతుడు అనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సిటీ దాటని వాడు... ఓ గ్రామం ను దత్తత తీసుకుని..అక్కడ పరిస్దితులు చక్కబెడతాడని అంటున్నారు. ఆ ఊరు పరిస్ధితులు బాగోలేక జనం ఖాళీ చేసి వెళ్లిపోతుంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్ధితుల్లో అక్కడికి ప్రవేసించిన మహేష్... ఆ ఊరుతో అనుబంధం పెంచుకుంటాడని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో అక్క సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని అంటున్నారు. అయితే ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఊహాగానం మాత్రమే. ఎంతవరకూ నిజమో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.


English summary
Mahesh Babu's upcoming film Srimanthidu photos leaked. Shooting of the movie going on at a brisk pace in Malyasia at the moment. Including Mahesh, all the lead cast like Jagapathi Babu, Sukanya, Sana and Angana Roy are taking part in the shoot under the direction of Koratala Siva.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu