»   » మహేష్ ఫ్యాన్స్ లెట్స్ రాక్: స్పైడర్ రిలీజ్ డేట్ పక్కా

మహేష్ ఫ్యాన్స్ లెట్స్ రాక్: స్పైడర్ రిలీజ్ డేట్ పక్కా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇదిగో అదిగో అంటూ దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుండీ షూటింగ్‌ దశలోనే ఉన్న సూపర్‌స్టార్‌ మహేష్‌ 'స్పైడర్‌' చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు కన్ఫామ్‌ అయింది. తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్‌ రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి విడుదలవుతుంది. దసరా కానుకగా సెప్టెంబరు 27న 'స్పైడర్' తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ విషయమై ప్రకటన చేశారు. 

130 కోట్ల భారీ బడ్జెట్ తో

130 కోట్ల భారీ బడ్జెట్ తో

విజయదశమి సందర్భంగా సెప్టెంబరు 27 న ‘స్పైడర్‌'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు 'స్పైడర్' పీఆర్వో బి.ఎ.రాజు ట్విట్టర్లో 'స్పైడర్' రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దగ్గర దగ్గరగా బాహుబలి పార్ట్ వన్ అంత బడ్జెట్ ఇంచు మించు 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది.


Mahesh babu disappointed on Spyder Movie Delay | Filmibeat Telugu
'స్పైడర్'ను చెక్కుతున్నాడు

'స్పైడర్'ను చెక్కుతున్నాడు

ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది నుంచి 'స్పైడర్'ను చెక్కుతున్నాడు మురుగదాస్. మామూలుగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. మురుగదాస్ ఇంత టైం తీసుకునేసరికి అంచనాలు మరింత పెరిగాయి. ఇంకొక్క పాట మినహాయిస్తే 'స్పైడర్' చిత్రీకరణ అంతా పూర్తయింది. సమాంతరంగా ప్రి ప్రొడక్షన్ పనులూ జరుగుతున్నాయి.


పక్కా క్లారిటీ ఏమీ లేదు

పక్కా క్లారిటీ ఏమీ లేదు

అయితే ఈ డేట్ కూడా ఫైనలా లేదంటే మళ్ళీ మార్పు ఉండొచ్చా అన్న విషయం లో మాత్రం పక్కా క్లారిటీ ఏమీ లేదు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్'ను సెప్టెంబరు 29న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే.


కాస్త ఆలోచించాలి

కాస్త ఆలోచించాలి

మరోవైపు 'స్పైడర్' విడుదల తేదీ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న టైంలోనే సెప్టెంబరు 21న తమ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు 'జై లవకుశ' టీం ప్రకటించడమూ తెలిసిందే. మరి ఆసమయం లో విడుదల చేయటం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఎక్కువ కాలం గ్యాప్ తీసుకొని వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయిన రికార్డ్ మహేష్ కి ఉంది. మరి ఈ సినిమా ఆ పాత నమ్మకాన్ని తుడిచి పెట్టేలాగానే కనిపిస్తోంది...English summary
Mahesh Babu's Telugu - Tamil blingual confirmed for September 27 release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu