»   » ‘బ్రహ్మోత్సవం’ తర్వాత వినాయక్‌తో మహేష్ బాబు మూవీ?

‘బ్రహ్మోత్సవం’ తర్వాత వినాయక్‌తో మహేష్ బాబు మూవీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘శ్రీమంతుడు' భారీ విజయం సాధించడంతో మహేష్ బాబు, అతని ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే ఉత్సాహంలో మహేష్ బాబు తన తర్వాతి సినిమా ‘బ్రహ్మోత్సవం' సినిమా మొదలు పెట్టబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 14న ప్రారంభం కాబోతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బ్రహ్మోత్సవం' తర్వాత మహేష్ బాబు మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వినాయక్ మహేష్ బాబు ఇమేజ్ కు సరిపోయే అద్భుతమైన స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే ప్రాజెక్టు మొదలు కాబోతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. గోపీ మోహన్, కోన వెంకట్ ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో తలముకలైనట్లు సమాచారం.

 Mahesh Babu to team up with VV Vinayak after Brahmotsavam?

‘బ్రహ్మోత్సవం' గురించిన వివరాల్లోకి వెళితే...
మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోయే ‘బ్రహ్మోత్సవం' చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని, ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆయన స్పష్టం చేరారు.

మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ బ్యాన‌ర్‌పై పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ‘బ్రహ్మోత్సవం' సినిమా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబుకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో హిట్ అందించిన దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమాను జ‌న‌వ‌రి 8, 2016 అని రిలీజ్ చేస్తామ‌ని అప్పట్లో ప్ర‌క‌టించారు. సంక్రాంతి పండగకు సినిమా వస్తుందనే ఆశతో చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా అనుకున్నట్లుగా సంక్రాంతికి విడుదల చేయడం లేదు. వివిధ కారణాలతో సినిమా అప్పటికి పూర్తయ్యే అవకాశం లేక పోవడంతో మార్చి 25, 2016న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

వాస్తవానిక ఈ సినిమా షూటింగ్ జులై 10 నుండి మొదలు కావాల్సి ఉంది. తర్వాత ఆగస్టు 18 నుండి మొదలు పెడదామనుకున్నారు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విషయాన్ని బట్టి సినిమా సెప్టెంబర్లో మొదలు కానుంది. ‘శ్రీమంతుడు' విడుదల ఆలస్యం కావడంతో ‘బ్రహ్మోత్సవం' షూటింగ్ కూడా అనుకున్న సమయానికి మొదలు కాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
The latest update is that Mahesh Babu is likely to team up with VV Vinayak after Srikanth Addala’s Brahmotsavam.
Please Wait while comments are loading...