»   » మహేష్‌తో ముగ్గురు హీరోయిన్లు, సమంతపై ఫ్యాన్స్ చిరాకు!

మహేష్‌తో ముగ్గురు హీరోయిన్లు, సమంతపై ఫ్యాన్స్ చిరాకు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ఒకే సినిమాలో ముగ్గు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోయే ఈ సినిమాను ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. పివిపి సినిమా బేనర్లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్నినిర్మించబోతున్నారు.

సినిమాకు మరింత మసాలా అద్దడంలో భాగంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. లీడ్ హీరోయిన్ గా సమంత నటించనుందని అంటున్నారు. మిగతా ఇద్దరు ఎవరు అనేది ఇంకా ఖరారుకాలేదు. అయితే సమంతను ఎంపిక చేయడంపై ఆయన అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


Mahesh Babu To Romance Three Heroines

గతంలో సమంత, మహేష్ బాబు మధ్య చిన్న పాటి మాటల యుద్ధం జరిగింది. అందుకే సమంత అంటే మహేష్ బాబు అభిమానులకు చిరాకు. 1-నేనొక్కడినే సమయంలో సమంత తన ట్విట్టర్ ద్వారా వివాదాస్సద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మహేష్ బాబు అభిమానులంతా సమంతపై ఇంటర్నెట్ ద్వారా దండెత్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు' సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇందులో మహేష్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

English summary
Super Star Mahesh Babu is all set to romance three heroines in his upcoming film with Srikanth Addala. The film is said to be titled as Brahmotsavam and it is being bankrolled by Prasad V Potluri, under PVP Cinema banner. Adding more spice to the scenario, Samantha is going to play the female lead in the film along with two other beauties.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu