»   » మహేష్, త్రివిక్రమ్ అరుకు ప్రయాణం డిటేల్స్

మహేష్, త్రివిక్రమ్ అరుకు ప్రయాణం డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ అరుకులో షూటింగ్ పెట్టుకున్నారు. మే పదకొండునుంచి ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. అక్కడ ఓ నెల రోజులు పాటు షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇప్పటికి అరవై పర్శంట్ పూర్తయిన ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్తున్నారు. ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం సి.కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక కనకరత్న బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రముఖ ఫైనాన్సియర్ శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య ల కాంబినేషన్లో పులి చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu