»   » బాలుడి చివరి కోరిక తీర్చిన మహేష్ బాబు (ఫోటో)

బాలుడి చివరి కోరిక తీర్చిన మహేష్ బాబు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్నకాకినాడకు చెందిన ఆ బాలుడు జీవితం చివరి దశలో ఉన్నాడు. చివరి కోరి తన అభిమాన హీరో మహేష్ బాబును కలవాలని. ఆ బాలుడి మనసులోని కోరికను మహేష్ బాబు దృష్టికి తీసుకెళ్లేందుకు అభిమానులు సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకున్నారు. మొత్తానికి ఈ విషయం మహేష్ బాబుకు చేరింది.

వెంటనే ఆ బాలుడిని, అతని కుటుంబ సభ్యులను కలవాలని నిర్ణయించుకున్నాడు మహేష్ బాబు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో వారిని ప్రైవేట్ గా కలిసే ఏర్పాటు చేసుకున్నాడు. మహేష్ బాబును కలవగానే ఆ బాలుడి మొహం సంతోషంతో వెలిగిపోయింది. బాలుడి మొహంలో సంతోషం చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసారు. మహేష్ బాబు తో పాటు శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు.

బాలుడి కోరికను సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుకు చేరేలా చేసిన అభిమానులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

English summary
Mahesh came to know about this boy from Kakinada who is suffering from a chronic ailment through social media and met him today at Hyderabad. After getting to know about the boy, Superstar himself has arranged for the boy’s visit along with his family to Hyderabad today and spent quality time with him privately.
Please Wait while comments are loading...