»   »  నిజ జీవిత ‘శ్రీమంతుడు’ గా మారుతున్న మహేష్...వివరాలు

నిజ జీవిత ‘శ్రీమంతుడు’ గా మారుతున్న మహేష్...వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు తవ తాజా చిత్రం శ్రీమంతుడులో చెప్పిన సందేశాన్ని అక్కడితో వదిలేయకుండా నిజ జీవితంలోనూ ఆచరణలోకి పెడుతున్నారు. దాంతో ఆయన నిజ జీవిత శ్రీమంతుడు అవుతూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. ఈ విషయమై ఆయన చేయబోయే పనులు గురించి రీసెంట్ గా ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో త్వరలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని సినీనటుడు మహేష్‌బాబు తెలిపారు. ఆ గ్రామ వివరాల్ని త్వరలో వెల్లడిస్తానని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గ్రామజ్యోతిలో భాగాంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్‌ కోరారని తెలిపారు.అసలు ఈ ఊరు దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ కి తనకి స్ఫూర్తి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ అని మహేష్ తెలియజేశాడు.

మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు' సినిమా రీసెంట్ గా విడుదలై పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు పల్లెలను దత్తత తీసుకుని వాటి అభివృద్దికి పాటు పడాలనే సందేశం ఇచ్చారు. ఇప్పుడా సందేశం ఎంతో మందికి రీచ్ అవుతోంది. ఎన్నారైలు,ఇక్కడ ఉన్న శ్రీమంతులు చాలా మంది ఈ దిసగా అడుగులు వేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

స్లైడ్ షోలో ఆయన ఈ విషయమై చేసిన ట్వీట్స్ చూద్దాం.

మార్చేసింది

తనను శ్రీమంతుడు చిత్రం ఎలా మార్చిందో చెప్పుకొచ్చారు

చంద్రబాబు గారి...

‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ నుంచే నాకు నా సొంత ఊరు బుర్రిపాలెంని దత్తత తీసుకోవాలనుకున్నాను.

మా బావ వల్లే

దీనికి సహాయం చేసిన మా బావ మరియు గుంటూరు ఎం.పి జయదేవ్ గల్లాకి స్పెషల్ థాంక్స్

కేటీఆర్ మెచ్చుకున్నారు

శ్రీమంతుడు చూసి తెలంగాణ మంత్రి కేటిఆర్ అభినందించడం చాలా హ్యాపీ గా ఉంది

కేటీఆర్ సూచన

ఆయన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా బాగా వెనుకబడిన జిల్లా అయిన మహబూబ్ నగర్లో ఓ విలేజ్ ని అడాప్ట్ చేసుకోమని సూచించారు,.

యస్ అన్నాను

దానికి నేను వెంటనే ఓకే చెప్పేసాను...త్వరలోనే పూర్తి డిటేల్స్ ఇస్తాను

English summary
Read what Mahesh Babu has to say about adopting a village each from Telugu states and how Srimanthudu played a important role in his life in the slides below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu