»   » ‘1 నేనొక్కడినే’ గురించి మహేష్ బాబు ట్వీట్

‘1 నేనొక్కడినే’ గురించి మహేష్ బాబు ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న '1 నేనొక్కడినే' చిత్రం ఫస్ట్ లుక్ టీజర్.... కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు సినీ ప్రేమికుల నుంచి, మహేష్ బాబు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

టీజర్‌కు మంచి స్పందన రావడంపై మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసారు. ' మా చిత్రం '1' ఫస్ట్ లుక్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినిమా టీం మొత్తం మీ అంచనాలను అందుకోవడానికి చాలా కష్ట పడి పని చేస్తున్నారు. నా కెరీర్లో ఈచిత్రం మరో ల్యాండ్ మార్క్ అవుతుంది' అని ట్వీట్ చేసారు.

మీ ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యాచించిన మహేష్ బాబు.....ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన తండ్రి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మహేష్ సినిమాకు ఆయన తొలిసారి పనిచేస్తుండటం విశేషం. ఇప్పటివరకూ సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిని మించేలా అద్భుతమైన సంగీతాన్ని దేవిశ్రీ అందించినట్లు సమాచారం.

మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary

 "Overwhelmed with the response of the 1st look and teaser of our film 1. The entire team is working really hard to meet your expectations...will be another landmark film in my career. Thankyou so much for your love and support as always :)" Mahesh Babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu