»   » సూపర్... మహేష్ మళ్లీ ట్వీటాడు

సూపర్... మహేష్ మళ్లీ ట్వీటాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అందరిలా మహేష్‌బాబు ఎప్పుడు పడితే అప్పుడు ట్వీట్ చేస్తూ కూర్చోడు. తన అభిమానలతో ప్రత్యేకంగా మాట్లాడలనకున్నప్పుడో, లేక ఆనందం పంచుకోవాలనుకున్నప్పుడో, ధాంక్స్ చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే ట్వీట్ చేస్తూంటారు. తాజాగా ఆయన మరోసారి ట్వీట్ చేసారు. ఈ సారి ఆయన తన చిత్రం ఆగడు టీజర్ ని అదరించినందుకు ఆనందం తెలియచేస్తూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ... " నా అభిమానులు అందరికీ పెద్ద ధాంక్స్... లవ్ యు... :)". అన్నారు.

హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఆయన ఇలా పంచుకున్నారు.
14 రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

Mahesh Babu tweet about thanks fans

పంచ్‌ డైలాగు లేకపోతే.. టీజర్‌, ట్రైలర్‌ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్‌ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్‌ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>a big thankyou to all of my fans ..love you guys as always:)</p>— Mahesh Babu (@urstrulyMahesh) <a href="https://twitter.com/urstrulyMahesh/statuses/472729734212624384">May 31, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.


ఇటీవల లడఖ్‌లో చిత్రీకరణ పూర్తిచేశారు. ఈనెల 5 నుంచి 21 వరకూ ముంబైలో మరో షెడ్యూల్‌ జరగనుంది. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్‌ కెరీర్‌లో నెంబర్‌ వన్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. మహేష్‌ పలికే ప్రతి సంభాషణ ఆకట్టుకొంటుంది. ఆయన కామెడీ టైమింగ్‌ అందరికీ నచ్చుతుంద''ని చిత్రబృందం చెబుతోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, నెపోలియన్‌, సాయికుమార్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh Babu tweeted "a big thankyou to all of my fans ..love you guys as always:)". Aagadu stars Mahesh,Tamanna under the direction of Srinu Vytla.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu