»   » మహేష్..! ఇంతలేటా..? : పాపం..! మళ్ళీ మహేష్ పై ట్రోలింగ్ మొదలయ్యింది

మహేష్..! ఇంతలేటా..? : పాపం..! మళ్ళీ మహేష్ పై ట్రోలింగ్ మొదలయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఎంత ఫాలోయింగ్ ని పెంచుతుందో అంతగానూ తల నొప్పిగా తయారయ్యింది. ముఖ్యంగా సినీ స్టార్ లకు. టాలీవుడ్ లో ఎక్కువగా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ కి బలయ్యేది మహేష్ బాబు నే. ఎప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా మహేష్ ని ట్రోల్ చేయటానికి యాంటీ ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. ఇప్పుడు తాజాగా కే. విశ్వనాథ్ కి వచ్చిన పురస్కారం పై మహేష్ ట్వీట్ కూడా ఇలాగే యాంటీ ఫ్యాన్స్ కి ట్రోలింగ్ ఆయుధం అయ్యింది.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

గతలో ఒకసారి ఇలాగే ‘బ్రహ్మోత్సవం' విడుదలైన తర్వాత సోషల్ మీడియాకు ప్రధాన వేదికగా మారిన ట్విట్టర్లో పవన్ - మహేష్ అభిమానుల మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ‘బ్రహ్మోత్సవం' సినిమాను హేళన చేస్తూ పవన్ అభిమానులు చేసిన సందడి ఏకంగా ఓ దినపత్రిక కూడా ప్రచురించడంతో అది మరింత ముదిరి పాకాన పడింది.

ప్రిన్స్ మహేష్ బాబు

ప్రిన్స్ మహేష్ బాబు

అయితే కాలక్రమేణా ఆ వివాదం తెరమరుగయ్యింది. సినిమా విడుదలకు ముందు ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ఓ ట్వీట్ లోని స్పెల్లింగ్ మిస్టేక్ ను పట్టుకుని పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చకు తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆతర్వాత ‘ఉత్తమ నటుడు'గా సైమా నుండి పురస్కారం అందుకున్నందుకు గానూ కృతజ్ఞతలు చెప్తూ ప్రిన్స్ మహేష్ బాబు ఓ ట్వీట్ చేసారు.

చికాకు పెడుతూనే ఉన్నారు

చికాకు పెడుతూనే ఉన్నారు

అయితే ఆ ట్వీట్లో ‘బెస్ట్ యాక్టర్ ట్రోఫీ' అని ప్రిన్స్ ప్రస్తావించడం ఈ సారి రచ్చకు కారణమైంది. ఇలా మహేష్ చేసే ప్రతీ ట్వీట్ లోనూ ఏదో ఒక పాయింట్ ని లేవనెత్తి చికాకు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్ద్ అందుకుంటున్న సందర్బం లో దర్శకుడు కే.విశ్వనాథ్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ పెట్టాడు మహేష్ బాబు. అయితే దీన్ని కూడా వివాదం చేసే పనిలో పడ్డారు జనం... ఇంతకీ ఏమైందీ అంటే....

కె.విశ్వనాథ్‌

కె.విశ్వనాథ్‌

కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కిన నాలుగు రోజుల తర్వాత మహేష్ తీరిగ్గా ఆయనకు అభినందనలు చెప్పడం.. ఆయన తనకు స్ఫూర్తి అని చెప్పడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.ఇక సెటర్ వేసే వాళ్ళన్ మహేష్ ఫ్యాన్స్ కూడా ఎదుర్కోవటం మొదలు పెట్టారు. అయితే... మరీ పచ్చి బూతులతో..

కుదరకపోయి ఉండొచ్చు

కుదరకపోయి ఉండొచ్చు

మిగతా వాళ్లలాగా విశ్వనాథ్‌ను నేరుగా కలిసి అభినందనలు చెప్పడానికి కుదరకపోతే కుదరకపోయి ఉండొచ్చు. నేరుగా కలవడం కోసం ఆలస్యమైతే అర్థం చేసుకోవచ్చు. కానీ ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడానికి ఎందుకంత ఆలస్యం.. పురస్కారం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత ఆయన గుర్తుకు రాలేదా..

సైలెంటుగా ఉన్నా ఇబ్బందే

సైలెంటుగా ఉన్నా ఇబ్బందే

ఈ మొక్కుబడి తంతు ఎందుకు.. అని జనాలు ప్రశ్నిస్తున్నారు. మహేష్ సినిమాల్లాగే.. విషెస్ చెప్పడంలోనూ లేటేనా అంటున్నారు నెటిజన్లు. అలాగని మహేష్ విస్ చేయకుండా సైలెంటుగా ఉన్నా ఇబ్బందే. కాకపోతే ఈ విష్ చేయడమేదో కాస్త ముందుగా చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు.

English summary
"Congratulations to K. Vishwanath garu on winning the Dada Saheb Phalke Award! A legendary name in the Indian cinema!" Tweets Mahesh babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu