»   » మహేష్ బాబు...పాతికేళ్ల లుక్ కోసం రూ.కోటి ఖర్చు?

మహేష్ బాబు...పాతికేళ్ల లుక్ కోసం రూ.కోటి ఖర్చు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఈ నెల 20న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మహేష్ బాబు మరింత యంగ్ లుక్ తో కనిపించబోతున్నారు.

40 ఏళ్ల వయసున్న ఆయన పాతికేళ్లలోపు ఉన్న కుర్రాడిలా కనిపించబోతున్నారు. ఇందుకోసం చాలా ఖర్చు పెట్టారు. ఆయన కాస్ట్యూమ్స్ విషయంలో, మేకప్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోకు 30 నుండి 40 కాస్టూమ్స్ వాడతారు. అయితే ఇందులో మాత్రం మహేష్ బాబు కోసం దాదాపు 100 కాస్టూమ్స్ వాడారట. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైన్ అక్షయ్ త్యాగి మహేష్ బాబు కాస్టూమ్స్ డిజైన్ చేారు.


మహేష్ బాబుకు ఎలాంటి డ్రెస్సు వేస్తే ఆయన మరింత యంగ్ లుక్ తో కనిపిస్తారో....అక్షయ్ త్యాగి లాంటి నిపుణులతో కాస్టూమ్స్ డిజైన్ చేయించారు. మేకప్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. ఇందుకోసం రూ. కోటి ఖర్చు పెట్టారని టాక్.


Mahesh Babu used 100 Costumes in Brahmotsavam

పివిపి సంస్థ ఈ చిత్రాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకు ఉన్న డిమాండుకు తగిన విధంగా అత్యధిక స్క్రీన్లు కేటాయించారు.


నైజాం ఏరియాలో 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ అన్ని థియేటర్ల ఉదయం 8.10కు అభిమానుల కోసం స్పెషల్ షో వేయాలని నిర్ణయించింది. తొలి రోజు(మే 20)న మాత్రమే ఈ స్పెషల్ షో వేస్తున్నారు.


ప్రస్తుతం మూవీ టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మే 20 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలవుతోంది. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

English summary
According to the sources, Mahesh Babu who is playing the role of rich Vijayawada guy, used literally 100 colourful costumes which were finalized by popular designer Akshay Tyagi and Srikanth Addala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X