twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'యమలీల' మహేష్ బాబు సినిమా.. హిట్ పడగానే తోపు అనుకోలేదు.. కమెడియన్ అలీ!

    |

    కమెడియన్ అలీ టాలీవుడ్ లో కమెడియన్ గా, టీవీ హోస్ట్ గా ఇప్పటికీ రాణిస్తున్నాడు. ఒకప్పుడు అలీ హీరోగా కూడా నటించారు. యమలీల లాంటి సూపర్ హిట్ చిత్రం అలీ ఖాతాలో ఉంది. ఇటీవల అలీ టాలీవుడ్ లోకి వచ్చి నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సన్మానం కూడా జరిగింది. తాజాగా అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హీరోగా అనేక విజయాలు సాధించినా పూర్తిస్థాయిలో కమెడియన్ గానే ఎందుకు ఉండిపోయారో వివరించాడు.

     ఎప్పుడూ ఒకేలా ఉన్నా

    ఎప్పుడూ ఒకేలా ఉన్నా

    సినిమా సెట్స్ లో హీరోలకు ఒకరకంగా, కమెడియన్లకు మరో రకంగా ట్రీట్మెంట్ ఉండదని అలీ తెలిపారు. తాను కూడా హీరోగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, కమెడియన్ గా కూడా అలాగే ఉన్నానని తెలిపారు. 40 ఏళ్ల సినీ కెరీర్ లో అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రల్లో నటించారు. అలీ కామెడీ పంచులు వెండి తెరపై బాగా పేలుతాయి. ఇటీవల అలీ బుల్లి తెరపై హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు.

     'యమలీల' మహేష్ బాబు సినిమా

    'యమలీల' మహేష్ బాబు సినిమా

    తన కెరీర్ లో హీరోగా సూపర్ హిట్ అందించిన యమలీల చిత్రం గురించి అలీ ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల కథని మహేష్ బాబు కోసం సిద్ధం చేసారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణకు విమానంలో ఈ కథ వినిపించారు. కథ బావుందని ప్రశంసించిన కృష్ణ కానీ మహేష్ బాబు ఇప్పుడు సినిమా చేయడం కుదరదని తెలిపారు. బాబు చదువుకుంటున్నాడు. చదువు పూర్తి కావడానికి మరో ఐదేళ్లు పడుతుందని తెలపడంతో మరో హీరోని వెతుక్కోవాల్సి వచ్చింది.

    నేను కనిపించా

    నేను కనిపించా

    హీరోగా ఎవరు అని ఎస్వీ కృష్ణారెడ్డి ఆలోచిస్తుండగా నేను కనిపించా. రెగ్యులర్ హీరోతో కాకుండా అలీతో చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించడం వెంటనే నన్ను ఒకే చేయడం జరిగింది. ఆ సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డిపై అనేక కామెంట్స్ వినిపించాయి. ఆయన దర్శకుడిగా అప్పటికే మూడు హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఈ సమయంలో ఓ కమెడియన్ తో చేస్తున్నావు.. నీ కెరీర్ దెబ్బ తినదా అని చాలామంది సలహా ఇచ్చారు. మాకు కథపై నమ్మకం అని ఎస్వీ కృష్ణారెడ్డి సమాధానం ఇచ్చారు.

    ఆయన రేంజ్ పెరిగింది

    ఆయన రేంజ్ పెరిగింది

    కానీ యమలీల చిత్రం ఒక్కసారిగా ఎస్వీ కృష్ణారెడ్డి స్థాయిని పెంచేసింది. అప్పటివరకు చేసిన చిత్రాలు ఒకెత్తు.. యమలీల మరో ఎత్తు అని అలీ తెలిపారు. యమలీల తర్వాత కూడా మరికొన్ని చిత్రాలు హీరోగా చేశా అని అలీ అన్నారు. కానీ యమలీల నా కెరీర్లో ఎప్పటికి స్పెషల్ అని తెలిపారు. హీరోగా విజయాలు సాధించినా అలీ కమెడియన్ గా కూడా చిత్రాలు చేశారు.

    అవకాశం రావడమే మహాభాగ్యం

    అవకాశం రావడమే మహాభాగ్యం

    హీరోగా అలాంటి సూపర్ హిట్ చిత్రాలు పడ్డ తర్వాత మళ్ళీ కమెడియన్ గా ఎందుకు కొనసాగారు అని ప్రశ్నించగా అలీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఇండస్ట్రీలో అవకాశం రావడమే మహా భాగ్యం. హీరోగా ఒక్క హిట్ పడగానే నా అంత తోపు ఇంకొకరు లేరు అని భావించలేదు. ఎలాంటి పాత్రలు వచ్చినా చేయాలి. హీరోగా ఛాన్స్ వస్తే చేస్తా.. అదే సమయంలో కామెడీ పాత్రలు కూడా చేయాలి అని భావించినట్లు అలీ తెలిపారు.

    English summary
    Mahesh Babu Was Selected First As Lead in Yamaleela Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X