»   »  ‘1’ (నేనొక్కడినే) ప్రెవేట్ స్క్రీనింగ్ షో చూసి మహేష్

‘1’ (నేనొక్కడినే) ప్రెవేట్ స్క్రీనింగ్ షో చూసి మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '1' (నేనొక్కడినే) ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రం స్పెషల్ షో ని మహేష్ బాబు ఏడవ తేదీ రాత్రి ప్రసాద్ ల్యాబ్ థియోటర్ లో చూడటం జరిగింది. ఇది ప్రెవేట్ స్క్రీనింగ్...నిర్మాతలు,మహేష్ బాబు,దర్శకుడు మాత్రమే ఈ షో చూసారు.ఈ షో చూసిన మహేష్ బాబు చాలా హ్యాపీ ఫీలయ్యారని సమాచారం.

ఈ చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 1500 కేంద్రాల్లో విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు రష్యన్, కొరియన్, ఫ్రెంచ్, జపనీస్, దక్షిణ అమెరికా దేశాల్లో ఆయా భాషల సబ్‌టైటిల్స్‌తో విడుదల చేస్తున్నాం. జనవరి 10నుంచి వివిధ దేశాల్లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Mahesh Babu watches 1 Nenokkadine

చిత్ర నిర్మాత గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ... సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. సినిమా అంతా డిజిటల్ ఫార్మాట్‌లో చిత్రీకరించాం. దాదాపు 175 రోజుల పాటు యూనిట్ మొత్తం సినిమా కోసం శ్రమించింది. తెలుగు సినిమా స్థాయిని పెంచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించాం అన్నారు.

రామ్ ఆచంట మాట్లాడుతూ 'హాలీవుడ్ చిత్రం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' తర్వాత లండన్ బ్రిడ్జిని ఎనిమిది గంటల పాటు బ్లాక్ చేసి షూటింగ్ జరుపుకున్న ఏకైక చిత్రం '1' అంతర్జాతీయ మార్కెట్‌ను చేరుకోవాలనే ఉద్దేశ్యంతో ఏరోస్ సంస్థతో భాగస్వామ్యమయ్యాం. కథానుగుణంగానే '1' టైటిల్‌పెట్టాం. మహేష్‌బాబు యాక్షన్, సుకుమార్ చూసి ప్రేక్షకులు హ్యాట్సాఫ్ చెప్పేవిధంగా సినిమా వుంటుంది' అన్నారు.

అనిల్‌సుంకర మాట్లాడుతూ ''1' ఎక్స్‌పెరిమెంటల్ మూవీ కాదు...తెలుగువూపేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించే సినిమా టాలీవుడ్‌లో హాలీవుడ్ సినిమాల వుంటుంది. ఇంతకుముందెప్పుడూ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూసి వుండరు. తెలుగు సినీ చరిత్రలోనే భారీస్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం' అన్నారు.

English summary
Mahesh Babu watched his upcoming release 1 Nenokkadine at Prasad Labs theatre on Tuesday night (Jan 7th). It was private screening, only the film’s producers and Mahesh Babu watched the film. Insiders say, he is totally happy with the outcome of this action thriller.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu