»   » డిప్రెషన్ లో ఉన్నమహేష్ కి త్రీ ఇడియట్స్ అమృతాంజన్..

డిప్రెషన్ లో ఉన్నమహేష్ కి త్రీ ఇడియట్స్ అమృతాంజన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దాని డైరక్టర్ కూడా.. అలాంటి ఇలాంటి వాడు.. కాదు..రోబో తో బాలీవుడ్ ను సైతం షేక్ చేసిన శంకర్.. త్రీ ఇడియట్స్ రీమేక్ లో మహేష్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే..అయితే అక్కడ కరీనా వేసిన పాత్రను.. ఇక్కడ ఇలియానా చేయబోతుంది. కాగా తమిళ వెర్షెన్ లో విజయ్ నటించనున్నాడు. ఈ రెండు వెర్షన్ లో ఇలియానా యే కథానాయిక గా ఎంపికవ్వడం విశేషం. మిగిలిన రెండు పాత్రలకు గాను జీవా, మరియు సిద్దార్థ పేర్లు వినవస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు సరైన హిట్ లేని మహేష్ బాబుకు ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వనుంది..అయితే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది..అతి త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి..వచ్చే వేసవిలో రీలీజ్ చేయాలని భావిస్తున్నారు.. ఖలేజా డివైడ్ టాక్ తో కాస్త డిప్రెషన్ లో ఉన్న మహేష్..త్రీ ఇడియట్స్ తో పోకిరి రీపీట్ అవుతుందని భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu