»   » క్యాన్సర్‌ బాధితుల కోసం మహేష్

క్యాన్సర్‌ బాధితుల కోసం మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్ బాబు క్యాన్సర్‌ బాధితుల కోసం పని చేస్తున్న ‘స్పర్శ్‌ హాస్పిక్‌' అనే స్వచ్ఛంద సంస్థకి నిధులు సమీకరించేందుకు కృషిచేస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ లో ఈనెల 23న స్పర్శ్‌ హాస్పిక్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కై ఫెస్ట్‌-2015లో ‘శ్రీమంతుడు' సినిమాని ప్రదర్శించనున్నారు.

ఈ స్కై ఫెస్ట్‌ డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు జరుగుతుందిని, ఈ ఫెస్ట్‌ ముగింపు రోజు అర్థరాత్రి శ్రీమంతుడు సినిమాని ప్రదర్శిస్తారని మహేశ్‌ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దానికి సంబందించిన ట్వీట్ ఇక్కడ మీరు చూడవచ్చు..

మహేష్ తాజా చిత్రం బ్రహ్మోత్సవం వివరాల్లోకి వెళితే...

సూపర్ హిట్ 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత మహేష్‌ బాబు చేస్తున్న సినిమా 'బ్రహ్మోత్సవం' . పి.వి.పి. సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. డిసెంబర్‌ 10 నుంచి నెలాఖరు వరకు ఊటీలో షెడ్యూల్‌ చేస్తారు. ఊటీలో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తాం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ తర్వాత మహేష్‌తో మళ్ళీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు.పి.వి.పి. సినిమా అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు.

మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Mahesh babu working for cancer patients

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.

English summary
Mahesh babu tweeted: Come enjoy Sreemanthudu at Skyfest 2015 on 27th Dec and support Sparsh Hospice. #LookUpHyderabad #SkyFest
Please Wait while comments are loading...