Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
‘సాజిద్ ఖాన్ లైంగికంగా వేధించాడు.. ఈసారి దీపికా పదుకోన్, జియా ఖాన్‌పై దారుణంగా..’
మీ టూ ఉద్యమం ప్రభావం బలంగానే కనిపిస్తున్నది. లైంగిక వేధింపులకు గురైన ప్రతీ ఒక్కరు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు. దర్శకుడు సాజిద్ ఖాన్ మరోసారి లైంగిక వేధింపుల విషయంలో మీడియాలో వివాదాస్పదంగా మారారు. చాలా నీచమైన జోక్స్‌తో వేధించేవాడని లారాదత్తా భర్త, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహేష్ భూపతి ఏమన్నారంటే

సాజిద్ ఖాన్ చేష్టల గురించి
హౌస్‌ఫుల్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు లారా దత్తాతో నేను డేటింగ్‌లో ఉన్నాను. ఆ సమయంలో మేము లండన్‌లో ఉన్నాం. ఆ సమయంలో లారా దత్తా క్లోజ్ ఫ్రెండ్, హెయిర్ డ్రస్సర్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ చేష్టల గురించి చెప్పింది.

మాటల్లో చెప్పలేని విధంగా
దీపికా పదుకోన్, జియా ఖాన్ చాలా దారుణంగా, మాటల్లో చెప్పలేని విధంగా వేధించాడు. అలాంటప్పుడు సాజిద్ ఖాన్‌తో ఎలా వేగుతున్నారు. ఎందుకు ఆ డైరెక్టర్‌తో పనిచేస్తున్నారు అని దీపికా, లారా, జియాఖాన్‌ను అడిగాను. ఆ తర్వాత కూడా అదే విధంగా సాజిద్ వ్యవహరించాడు. అతడి గురించి నా కంటే, లారా కంటే ఎక్కువగా చెప్పలేరు అని అన్నాడు.
‘జీవితంతో ఆడుకొన్నారు.. సూసైడ్‌కు ప్రయత్నించా'.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

హౌస్‌ఫుల్ షూటింగ్ సమయంలో
2010లో వచ్చిన హౌస్‌ఫుల్ చిత్రంలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, దీపికా పదుకోన్, జియా ఖాన్, అర్జున్ రాంపాల్ నటించారు. ఆ చిత్రంతోపాటు పలు చిత్రాల్లో పనిచేసిన హీరోయిన్లను దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చాలా మంది సాజిద్‌పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

సాజిద్ ఖాన్‌పై విచారణ
సాజిద్ ఖాన్‌పై వచ్చిన పలు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని ఇండియన్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ విచారణ చేపట్టింది. సాజిద్‌తోపాటు నటుడు అలోక్ నాథ్‌పై కూడా విచారణ నిర్వహిస్తుంది. త్వరలోనే వారిపై తీర్పు కూడా చెప్పబోతున్నది.