»   » వందల కోట్ల ఆస్తులు: మహేష్ బాబు బావే టాప్!

వందల కోట్ల ఆస్తులు: మహేష్ బాబు బావే టాప్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన గుంటూరు లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసారు. ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఆయన ఆస్తుల విలువ రూ. 671 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో మహేష్ బాబు బావ అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. తన భార్య పద్మావతి పేరు మీద రూ. 50 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించారు.

  ఎన్నికల బరిలోకి దిగుతున్న తన బావకు మహేష్ బాబు మద్దతు ప్రకటించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎందుకు ప్రచారం చేయాలనుకుంటున్నారో కూడా ఆయన క్లారిఫై చేసారు. తాను రాజకీయాలకు ఇప్పటికీ దూరమే అని, అయితే గుంటూరు నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ కోసం తాను రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు.

  Mahesh Brother in Law turns Richest Candidate in AP!

  అలాగే...తన సోదరి పద్మను ఆయన వివాహం చేసుకున్నపుడు నా వయసు 13, అప్పటి నుంచీ ఆయన తనకు రోల్ మోడల్, ప్రేరణ అని అన్నారు. ఆయన నన్ను ఆయన ట్రీట్ చేసే విధానం, తీసుకునే కేర్ తనకు బాగా నచ్చేదని అన్నారు. తర్వాత కాలంలో ఆయన విజన్ ని, దాన్ని విలువతో కూడి నిజం చేసుకోవటం అర్దం చేసుకున్నానని, ఈ రోజు అమర్ రాజా గ్రూప్, అమరన్ బ్రాండ్ అభివృద్దిని చూసానన్నారు. ఆయన తన విజయాలతో మీడియా చేత, పారిశ్రామిక వర్గం చేత గుర్తింపబడ్డారు అన్నారు.

  ఆయన ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని మాట్లాడేవారు, అయితే ఎందుకనేది నిజంగా నాకు అర్దం కాలేదు, నేను ఎప్పుడూ దాన్ని ఇష్టపడలేదు. రాజకీయాల ద్వారానే రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలనేవారు. అలాగే రాజకీయం ద్వారా చాలా మందికి సేవ చేయవచ్చు అనేవారు. ఆయన ఫేవరెట్ కోట్ ఏమిటంటే... "One man can make a difference, and every man should try."

  నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన డిఫెరెన్స్ తేగలరనే నమ్మకం ఉంది. ఆయనకు నా సపోర్టు ఓటు, ఆయన మీకు కూడా నచ్చుతాడనుకుంటున్నాను, గుంటూరు భవిష్యత్ ఆశాజ్యోతిగా ఆయన కాగలరు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ మహేష్ బాబు తన బావ గురించి ట్వీట్ ఇచ్చారు.

  English summary
  According to the election affidavit filed by candidates in fray for 2014 Polls from different political parties, Galla Jaydev who is Guntur TDP Lok Sabha candidate is the Richest Candidate. Galla Jaydev Total Assets: Rs 671 crore.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more