»   » మురుగదాస్ కి చేదు అనుభవం, ట్విట్టర్ సాక్షిగా మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం

మురుగదాస్ కి చేదు అనుభవం, ట్విట్టర్ సాక్షిగా మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదే మరి అయ్యవారిని చేయ్యబోతే కోతి అయ్యిందన్నట్టు తయారయ్యింది దర్శకుడు మురుగదాస్ పరిస్థితి. మహేష్ తో భారీ బడ్జెట్ సినిమా తీయటం ఏమిటో గానీ విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది మురుగదాస్ మీద. ఈ సినిమా మొదలైనప్పుడే సంక్రాంతికి వస్తుంది ఫస్ట్ లుక్ అన్నారు ఆగిపోయింది, తర్వాత గణతంత్ర దినోత్సవం అన్నారు ఆగిపోయింది, శివరాత్రి కూడా అలాగే తెల్లారి పోయింది ఫ్యాన్స్ కల మాత్రం తీరలేదు తర్వాత ఉగాది అన్నారు అదీ అవ్వలేదు. అసలు జూన్ 24 న రిలీజ్ అంటున్న సంగతి తప్ప ఇప్పటివరకూ ఏ సమచారమూ లేదు.

ట్విటర్ మీద విరుచుకుపడ్డారు

ట్విటర్ మీద విరుచుకుపడ్డారు

చూసీ చూసీ విసుగెత్తిపోయరు మహేష్ అభిమానులు... ఇంకా ఈ సాగదీత ఎదురు చూపులు తమ వల్ల కాదంటూ ఏకంగా మురుగదాస్ ట్విటర్ మీద విరుచుకుపడ్డారు. పాపం పండగ శుభాకాంక్షలు చెబుదాం అనుకున్న మురుగదాస్ కి ప్రేక్షకుల అసహనం ఎంత ఉందో అర్థమయ్యింది.

హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్

హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్

ఉగాది సందర్భంగా మురుగదాస్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇలా పోస్ట్ చేసి గంట కూడా గడవక ముందే మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో మురుగదాస్‌పై ముప్పేట దాడికి దిగారు. ఉగాది శుభాకాంక్షలు తర్వాత సంగతి.. ముందు మహేష్ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావని ఒకరు కామెంట్ పెడితే,

ఏకంగా 3వందల మంది

ఏకంగా 3వందల మంది

మహేష్ సినిమా ఫస్ట్ లుక్ చూడని తమకు ఉగాది పండుగ కూడా జరుపుకోవడం ఇష్టం లేదని మరొకరు పోస్ట్ చేశారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3వందల మంది దాకా ఫస్ట్‌లుక్ ఎప్పుడంటూ మురుగదాస్‌ను ప్రశ్నించారు. ఏదేమైనా శుభాకాంక్షలు తెలిపేందుకు పెట్టిన పోస్ట్... మహేష్ ఫ్యాన్స్ అసహనాన్ని మరింత పెంచిందనే చెప్పాలి.

అసంతృప్తితో రగిలిపోతున్నారు

మరి మురుగదాస్ ఇప్పటికైనా ఫస్ట్‌లుక్ డేట్ ప్రకటిస్తాడో, లేదో చూడాలి. తొలుత ఉగాదికి ఫస్ట్‌లుక్, టైటిల్ చెబుతారని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ ఉగాదికి కూడా డైరెక్టర్ క్లారిటీ ఇవ్వకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా త్వరగా ఆ ఫస్ట్ లుక్ ఏదో ఇచ్చేస్తే కాస్త పండగ చేసుకుంటారు కదా మరి...

English summary
Director Muruga Das posted Ugadi wishes But Mahesh fans Trolled him for First look of hes New Movie with Mahesh Babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu