»   » ‘బాహుబలి’ కంటే ‘శ్రీమంతుడు’కే ఎక్కువ ధర పలికిందట!

‘బాహుబలి’ కంటే ‘శ్రీమంతుడు’కే ఎక్కువ ధర పలికిందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత నెలలో విడుదలైన ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడంతో పాటు బాలీవుడ్లోనూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న‘బాహుబలి' ఒక ప్రత్యేకమైన సినిమా. ఏ విషయంలో అయినా దాన్ని మించిన సినిమా ఇప్పటి వరకు లేదు. బాహుబలి సినిమాకు వచ్చినంత క్రేజ్ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రాలేదు. అసలు ఇతర సినిమాలతో బాహుబలిని పోల్చడమే అనవసరం.

అయితే తాజాగా విడుదలైన మహేష్ బాబు ‘శ్రీమంతుడు' ఓ విషయంలో మాత్రం ‘బాహుబలి' బీట్ చేసిందట. యూ.ఎస్.ఏలో ‘శ్రీమంతుడు' భారీ ఎత్తున రిలీజైంది. గురువారం సాయంత్రం భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేసారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు ఒక్కో టికెట్‌కు రూ. 15000 చెల్లించి సొంతం చేసుకున్నారట.


Mahesh fans have brought each ticket with Rs 15000

‘బాహుబలి' సినిమా విడుదల సమయంలో క్రేజ్ ఉంది కానీ ఈ రేంజిలో మాత్రం లేదు. బాహుబలి ప్రీమియర్ షో ఒక్కో టికెట్ డిమాండ్ రూ. 8 వేల నుండి రూ. 9వేలకు మించలేదని అంటున్నారు. మహేష్ బాబుకు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల రూ. 15000 వరకు ఒక్కో టికెట్ అమ్ముడయిందని ఓవర్సీస్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.


ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Thursday evening Srimanthudu premiere shows across USA, many enthusiastic fans have brought each ticket with Rs 15000 approximately.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu