»   » నిజమే....! మహేష్ బాబు ‘మగాడు’

నిజమే....! మహేష్ బాబు ‘మగాడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి గత కొంతకాలంగా 'శ్రీమంతుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టడం లేదు. ‘మగాడు' అనే టైటిల్ ఖరారు చేసారు. గత రెండు మూడు రోజులు గా ఈ చిత్రానికి ‘మగాడు' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ‘మగాడు' టైటిల్ పెడుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ధృవీకరించారు.

మే 31 న ‘మగాడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. మే 31 ...మహేష్ తండ్రి కృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా మహేష్‌బాబు కొత్త సినిమాకి సంబంధించిన తొలి ప్రచార చిత్రం విడుదల కాబోతోంది. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది.

Magaadu

ఈ సినిమాని జూలైలో రిలీజ్ చెయ్యాలని ముందుగా ప్లాన్ చేసుకొని జూలై 17వ తేదీని ఈ సినిమా రిలీజ్ కోసం లాక్ చేసారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉండండం వలన ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ‘బాహుబలి' సినిమా రిలీజ్ కూడా ఉండటంతో అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా? లేదా? అనేది సందేహంగా మారింది.

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘బ్రహ్మోత్సవం' స్టార్ట్ చేశారు. మే నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
It was recently buzzed that Prince Mahesh's upcoming film's title to be confirmed as 'Magaadu'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu