మహేష్‌బాబు నా పేరు చెప్పారనే చేసాను
హైదరాబాద్ : ''మహేష్ నటనంటే నాకు ఇష్టం.'శ్రీమంతుడు' స్క్రిప్టు పనులు జరుగుతున్నప్పుడు ఓ పాత్రకు యంగ్ హీరోని తీసుకొంటే బాగుంటుంది అనుకొన్నారట. అప్పుడు 'అందాల రాక్షసి'లో చేసిన అబ్బాయిని తీసుకొందాం' అని నా పేరు చెప్పారట. ఆ మాట వినగానే ఇంకేం ఆలోచించలేదు. మహేష్ సెట్లో ఎలా ఉంటాడో చూడ్డానికైనా ఈ సినిమా చేయాల్సిందే అనుకొన్నా'' అన్నారు రాహుల్ రవీంద్రన్.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలరించాడు రాహుల్ రవీంద్రన్. 'అలా ఎలా'తో ఓ మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఇప్పుడు 'టైగర్' ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. 'శ్రీమంతుడు'లోనూ అతిథి పాత్ర పోషించాడు. రాహుల్ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించాడు.

'టైగర్' గురించి మాట్లాడుతూ... ''స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే పక్కా వాణిజ్య చిత్రం 'టైగర్'. ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి అనేగానే ముక్కోణపు ప్రేమకథ అనుకొంటారు. అయితే మా మూడు పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది చాలా కీలకం అన్నారు.
అలాగే సందీప్‌కిషన్‌లాంటి స్నేహితుడితో కలసి నటించడం ఓ మంచి అనుభూతి. 'టైగర్'ని తనే నా దగ్గరకు తీసుకొచ్చాడు. సినిమా బాగా వచ్చింది. 'అలా ఎలా' తరవాత చేస్తున్న సినిమా ఇది. కాబట్టి మరో విజయం సాధించాలన్న తపనతో చేశాము''అన్నారు.


Click it and Unblock the Notifications











